దుర్గి మండలంలో ఎమ్మెల్యే జూలకంటి ప్రచారం
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 22:పల్నాడు జిల్లా, దుర్గి మండలం ఈనెల 27వ తేదీన జరగనున్న ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ప్రచారాన్ని శనివారం దుర్గి మండలంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్యాలయాలలో పనిచేస్తున్న పట్టభద్రులను ఆయన కలసి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. మండల కేంద్రంలోని గ్రాడ్యుయేట్ ఓటర్లను కలసి ప్రభుత్వం రాబోయే రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి వారికి వివరించారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అందుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు.
Tags:
Views: 2
About The Author
Related Posts
Post Comment
Latest News
24 Mar 2025 23:58:44
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
Comment List