వెయిట్ లిఫ్టర్ నీలం రాజును సన్మానించిన మాచర్ల ఎమ్మెల్యే
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి పిబ్రవరి12:ఉత్తరాఖండ్లో జరిగిన 38వ జాతీయ క్రీడల్లో భాగంగా, వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో.. మాచర్ల హనుమాన్ వ్యాయామశాల స్టూడెంట్ కోమెరా నీలం రాజు, ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా వెయిట్ లిఫ్టర్ నీలం రాజు, వెయిట్ లిఫ్టింగ్ కోచ్ శివకేశవ యాదవ్, ను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో పల్నాడు ప్రాంత క్రీడాకారులకు అండగా ఉంటామని అన్నారు, మరిన్ని మెడల్స్ సాధించి మన పల్నాడు ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువనేత జూలకంటి అక్కిరెడ్డి, పులుసు రఘునాథరెడ్డి, హనుమాన్ జిమ్ కోచ్ ఆది విష్ణు యాదవ్, కోమెరా శ్రీనివాసరావు, అనంత రాములు, వెయిట్ లిఫ్టర్ మంజుల అశోక్, మల్లికార్జునరావు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comment List