బీజేపీ గెలుపు దుర్గిలో సంబరాలు..!!
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 08:పల్నాడు జిల్లా, దుర్గి మండలం,ఇటీవల ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు పూర్తయింది. ఎన్నికల ఫలితాలలో భాగంగా బిజెపి అఖండ మెజారిటీతో విజయకేతనం ఎగురవేసింది. ఈ సందర్బంగా మండలకేంద్రమైన దుర్గిలో బిజెపి నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందని అని బిజెపి పార్టీ సీనియర్ నాయకులు వెలిదండి శ్రీనివాసరావు అన్నారు. జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు పులి హరి మాట్లాడుతూ మన దేశ రాజధాని ఢిల్లీలో బిజెపి పార్టీ విజయం అన్ని రాష్ట్రాలకి బలమైన శక్తిగా నిలుస్తుందిన్నారు. ఈ సందర్బంగా కూటమి నాయకులు స్వీట్స్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో బి సి మహిళా మోర్చా జిల్లా నాయకురాలు గంజర్ల లక్ష్మీ, ఎస్సీ మోర్చా నాగేండ్ల మరియదాస్, టిడిపి పట్టణ అధ్యక్షులు పగడాల చెన్నకేశవులు, తెలుగు యువత సింగు నాగేశ్వరరావు, సూరె కృష్ణ,జనసేన పట్టణ అధ్యక్షులు రుద్రాల రవి కప్పెర పెద్దిరాజుమరియుకూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Comment List