ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి : జూలకంటి బ్రహ్మానందరెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఫిబ్రవరి 17 :ఆగాధంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి కోరారు. సోమవారం మాచర్ల పట్టణంలో శాసనమండలి ఎన్నికల బరిలో ఉన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అనేక పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేసిన సంఘటనలను చూసామని ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిన సంఘటనలు సైతం జరిగాయన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుండే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి సారించి అనేక పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడులు పెట్టించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. పరిశ్రమల ఏర్పాటు వలన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని అన్నారు. మాచర్ల నియోజకవర్గం లో ఇప్పటికే పలు దఫాలుగా జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు అండగా తమకూటమి ప్రభుత్వం నిలబడుతూ ఉందని అన్నారు. ఎన్నికల కోడ్ అనంతరం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల విడుదల కానుందని అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేసి నిరుద్యోగుల జీవితాలలో వెలుగు నింపే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ రుణాలను గత ప్రభుత్వం అందజేయలేదని వాటిని దారి మళ్లించిన విషయాన్ని గుర్తు చేశారు ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం బి సి ఎస్ సి ఎస్ టి ఓ సి కార్పొరేషన్ ద్వారా సంబంధిత వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పట్టబద్రులు తమ అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యతగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మద్దిరాల మ్యాని చైర్మన్ పోలూరు నరసింహారావు పట్టణ అధ్యక్షులు కొమర దుర్గారావు క్లస్టర్ ఇంచార్జ్ సయ్యద్ అన్వర్ భాష ఎన్డీఏ కూటమి నాయకులు జూలకంటి అక్కిరెడ్డి ఎనుముల కేశవరెడ్డి కజ్జం సైదయ్య ఓర్సు క్రాంతి కుమార్ మద్దిగప్పు చిన్న వెంకటరామిరెడ్డి గోగుల వెంకట్రామిరెడ్డి కొమ్మెర లాలా వినోద్ మాచర్ల పట్టణ యూనిట్ ఇన్చార్జులు భూతించార్జిలు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comment List