రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య కార్యక్రమం చేపట్టిన వ్యవసాయ అధికారి పాప కుమారి

రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య కార్యక్రమం చేపట్టిన వ్యవసాయ అధికారి పాప కుమారి

ఐ ఎన్ బి టైమ్స్ పలనాడు ప్రతినిధి గురజాల నియోజకవర్గ మార్చి 4 దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామం లో రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు కార్యక్రమం పై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి డి పాప కుమారి మాట్లాడుతూ, ఈ సంవత్సరం నుండి వ్యవసాయశాఖ ద్వారా రైతులకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ పథకాలను పారదర్శకంగా మరియు సులభతరంగా చేయడం కోసం వెబ్ లాండ్ లో పొలం కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇస్తున్నట్టు తెలియజేశారు. ఈ సంఖ్య కలిగిన రైతులకు మాత్రమే  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే పథకాలు అయిన పి.యం.కిసాన్ , పంట రుణాలపై వడ్డీ రాయితీ, క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, అన్నదాత సుఖీభవ, రాయితీ పై యంత్ర పరికరాలు మరియు సూక్ష్మ నీటి సేద్య పరికరాలు మరియు లబ్ధి చేకూరుతుంది అని తెలియజేశారు.

కావున రైతులందరూ వారి యొక్క గ్రామాల లోని రైతు సేవా కేంద్రం నందు విశిష్ట గుర్తింపు సంఖ్య ను నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. నమోదు చేసుకొనుటకు 
1. పొలం పాస్ బుక్ కాపీ 
  2.ఆధార్ కాపీ
  3.ఆధార్ కి లింక్ అయిన ఫోన్

ఈ పత్రాలు తీస్కుని వచ్చి రైతు సేవా కేంద్రం లో వీలైనంత త్వరగా రైతులందరూ విశిష్ట గుర్తింపు సంఖ్య ను పొంది,వ్యవసాయ శాఖ కు సహకరించ వలసిందిగా కోరడం జరిగింది.
అదేవిధంగా దాచేపల్లి మండలంలో వరి పంట వేసినటువంటి గ్రామాలన్నింటిలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరి పంట వేసినటువంటి రైతులందరికీ ఎలుకల మందును ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి డి.పాప కుమారి , గ్రామ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్సులు, వ్యవసాయ & ఉద్యాన సహాయకులు ,గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.

Tags:
Views: 0

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...