అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న : మెట్టు గోవిందరెడ్డి

అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న : మెట్టు గోవిందరెడ్డి

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఫిబ్రవరి 21 :అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి.స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో శుక్రవారంగుర్తుతెలియని ఒక మగ మనిషి ఏజ్ 50 సంవత్సరాలు వయస్సు గల అనాధ శవానికి స్థానిక మున్సిపాలిటీ వారి సహాయంతో అంత్యక్రియలు నిర్వహించినట్లు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. గత ఐదు రోజుల క్రితం మాచర్ల పట్టణ తాసిల్దార్ కార్యాలయం దగ్గర గుర్తుతెలియని ఒక మగ మనిషి 50 సంవత్సరాలు పడిపోయి ఉండటాన్ని గమనించిన స్థానికులు మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లేసరికి చనిపోయారు. ఈ విషయాన్ని వెంటనే మాచర్ల పట్టణ పోలీస్ సిబ్బందికి తెలియజేయగా వారి బంధువులు ఎవరైనా ఉన్నారేమో అని మీడియా ద్వారా ప్రకటనలు గత ఐదు రోజుల నుండి జారీ చేస్తున్నారు. ఐదు రోజుల నుండి బాడీ కూడా మాచర్ల పట్టణ గవర్నమెంట్ హాస్పటల్ మార్చురీ లోనే ఉంచారు. ఐదు రోజుల నుండి ఎవరు రాకపోయేసరికి పోలీసు వారు ముఖ్యంగా పట్టణ ఎస్సై గారు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి గారికి విషయాన్ని తెలియజేసి అంత్యక్రియలు జరపవలసిందిగా ఒక లెటర్ ను ఇచ్చారు. దానికి అంగీకరించి న వివేకానంద సభ్యులందరూ కూడా అనాధ శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపారు. ఈ విషయాన్ని పరిశీలించిన ప్రతి ఒక్కరు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో భవనాసి నాశరయ్య, టీచర్ గండ్రకోట శివసందర్ ప్రసాద్, శివ మరియు మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:
Views: 55

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...