శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
ఐ ఎన్ బి టైమ్స్ పలనాడు ప్రతినిధి గురుజాల నియోజకవర్గం మార్చి 16:పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, దాచేపల్లి మండలo, గామాలపాడు గ్రామంలోని నాయకురాలు నాగమ్మ ప్రాంగణము నందు విశ్వధర్మ పరిరక్షణ వేదిక - సాధుపరివార్ సంయుక్త ఆధ్వర్యంలో మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు శ్రీ జంగా కృష్ణ మూర్తి గారి ఆధ్వర్యంలో శ్రీ పార్వతీ దేవి సమేత చెన్నమల్లిఖార్జున స్వామి వార్ల దేవస్థానము పల్నాడు శ్రీ మహా శైవక్షేత్రము పున: ప్రతిష్ట సందర్బంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ శ్రీ బొల్ల రాజగోపాల్ నాయుడు బి. ఆర్. నాయుడు నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు శ్రీ జంగా కృష్ణ మూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి పాల్గోన్నారుఈ కార్యక్రమంలో విశ్వధర్మ పరిరక్షణ వేదిక మరియు సాధుపరివార్ పూజ్య స్వామీజీలు, మఠాధిపతులు, ఆశ్రమాధిపతులు, భక్తులు పాల్గొని. విశేష పూజల మధ్య. హోరెత్తిన భక్తులుపల్నాడు ఘన చరిత్ర - చెన్న మల్లిఖర్జున స్వామి12వ శతాబ్దానికి చెందిన స్త్రీ శక్తి స్వరుపిణి నాయకురాలు నాగమ్మ జిట్టగామాలపాడు గ్రామములో 800 సంవత్సరాల నాడు శ్రీ శ్రీ శ్రీ పార్వతీ దేవి సమేత చెన్న మల్లిఖర్జున స్వామి వార్ల దేవస్థానాన్ని నిర్మించి ప్రతిష్ట జరిగింది తిరిగి ఈ దేవాలయాన్ని పునః ప్రతిష్ట చేయుటకు ది. 16-3-2025 ఆదివారం ఉ. 8.58 ని॥ లకు శుభసంకల్పము గావించబడినది. చారిత్రాత్మిక వారసత్వపు కట్టడాన్ని ముందు తరాల వారికి అందించాలని అలాగే నాగులేరు ప్రక్కన సుమారు 18 ఎకరాల సువిశాల స్థలంలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా తీర్చిదిద్ది శ్రీ శ్రీ శ్రీ రాజ రాజేశ్వరి దేవి సమేత మహా రాజ రాజేశ్వర స్వామి వార్ల దివ్య ఆలయంతో పాటు ఉపాలయాలు, రాజగోపురాలు, నాలుగు వైపుల మడవిధులు ప్రధానంగా 272 అడుగుల ఎతైన రాజగోపురం (భారతదేశంలో అతి పెద్ద రాజగోపురం) నిర్మాణం కానుంది. అలాగే ఆధ్యాత్మిక ధ్యాన, యోగ కేంద్రాలు, వేద విద్యాలయం, గోశాల, అచ్చకుల వసతి, యాత్రికుల వసతి సముదాయం, అనాధలకు ఆశ్రమం, వృద్ధశ్రమం, పల్నాడు వైభవాన్ని ప్రతిబింబించే విధంగా మ్యుజియం, గ్రంధాలయం, నవగ్రహ, రాశి, నక్షత్ర వనములతో పల్నాటి ఘనకీర్తిని మరోక్కసారి ప్రపంచానికి సాటి చెబుదాం.
Comment List