శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి దేవస్థానం అమ్మవారి హుండీ ఆదాయం 15,52,027రూ.లు
By M.Suresh
On
ఐఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 24: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం దుర్గిమండల పరిధిలోని అడిగోప్పల గ్రామంలో వేంచేసియున్న శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి హూండీ కానుకలను దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త శ్రీయుత యాగంటి వెంకటేశ్వర్లు వారి అధ్యక్షతన లెక్కించగా రూ.లు 15,52,027/-ఆదాయము వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాణాధికారి మరియు అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి పి.సైదమ్మ బాయి తెలిపారు. 45 రోజుల పాటు భక్తులు అమ్మవారిని దర్శించుకొని కానుకలు, మొక్కుబడులు హూండీల్లో సమర్పించుకున్నారు. సోమవారం ఆలయ ముఖమండపంలో పర్యవేక్షణాధికారిగా పేటసన్నెగండ్ల గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి సిహెచ్. శివ నాగిరెడ్డి ఆధ్వర్యంలో హూండీల లెక్కింపు చేపట్టారు. హుండీ లెక్కింపులో బ్యాంకు సిబ్బంది, ఆలయ సిబ్బంది, భక్తులు, పాల్గొన్నారు.
Tags:
Views: 21
About The Author
Related Posts
Post Comment
Latest News
24 Mar 2025 23:58:44
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
Comment List