పెన్షనర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది : జూలకంటి బ్రహ్మానందరెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఫిబ్రవరి 22 :పెన్షనర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. శనివారం మాచర్ల పట్టణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ భవన్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ హయంలో పెన్షన్ పై ఆధారపడి జీవించే వారిని అనేక ఇబ్బందులకు గురి చేశారని సకాలంలో పెన్షన్ అందక మానసిక ఇబ్బందులకు గురయ్యారని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ను గత పాలకులు చిన్నాభిన్నం చేసినప్పటికీ పెన్షనర్ల కు సకాలంలో వారి ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందని అన్నారు. పెన్షన్ దారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటికి పెద్ద కొడుకు మాదిరిగా వారి యొక్క బాగుఓగులు చూసుకుంటున్నాడని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కొరకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అనేక పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుందని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పెన్షన్ దారులకు పిలుపునిచ్చారు. ఈనెల 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మద్దతుగా నిలిచి ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరారు.
Comment List