జగన్మోహన్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చిన పలనాడు జనసేన కటికం అంకారావు
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి గురజాల నియోజకవర్గం మార్చి :5 పవన్ కళ్యాణ్ ను ను విమర్శించే స్థాయి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి లేదని గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కటికం అంకారావు అన్నారు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.గడిచిన ఎలక్షన్లో ప్రజలు మిమ్మల్ని ఏ స్థాయిలో ఉంచారో మీరు తెలుసుకోవాలని ఆయన మండిపడ్డారు.తండ్రి చనిపోతే సంతకాలు పెట్టి శవ రాజకీయాలు చేసుకొని,సొంత అమ్మని చెల్లిని రోడ్డు మీదకి తీసుకు వచ్చి ,సొంత బాబాయిని సైతం రాజకీయంగా ఎదుర్కొనలేక,వారి హత్యను ఏ విధంగా బయటకు రాకుండా అధికారన్ని అడ్డం పెట్టుకున్నారో ప్రజలందరికీ తెలుసనీ,ఆయన అన్నారు.ప్రజలు మీకు ఇచ్చిన 11 స్థానాల వలన వై నాట్ 175 అన్న మీ స్థాయి నుండి ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారో మీరే అర్థం చేసుకోవాలన్నారు.మీలాగా తండ్రిగారి రాజకీయ వారసుడిగా మా అధినేత రాలేదనీ,జనసేన పార్టీ పెట్టి పది సంవత్సరాలు ప్రజల్లో ఉండి ఒక్క సీటుకి పరిమితమైన,ప్రజా సమస్యల మీద పోరాడుతూ,ఇప్పుడు ప్రజలు మాకు ఇచ్చిన100% స్ట్రైక్ రేట్ తో ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తుకు మేము నాంది పలుకుతున్నామని,ఆయన తెలియజేసారు.కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అభివృద్ధి సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.ఇంకా మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే రానున్న రోజుల్లో ఆ 11 సీట్లు కూడా రాకుండా ప్రజలే తీర్పిస్తారని ఆయన ఎద్దేవా చేశారు...!
Comment List