చత్రపతి శివాజీ 395 వ జయంతి ని ఘనంగా నిర్వహించిన : మెట్టు గోవింద్ రెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఫిబ్రవరి 19 :భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస బోధనలు అందరికీ ఆదర్శం.చత్రపతి శివాజీ ధైర్యానికి ప్రతిరూపం. స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో మాచర్ల శ్రీశైలం రోడ్ లో గల స్వామి వివేకానంద సేవాశ్రమంలో భగవాన్ శ్రీ రామకృష్ణ 190 వ జయంతి ఉత్సవాలు మరియు చత్రపతి శివాజీ 395 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి తెలిపారు .ముందుగా సేవాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు, పిల్లలతో కలిసి మెట్టు గోవిందరెడ్డి భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంసకు మరియు వీర శివాజీల చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మెట్టు గోవింద రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రపంచంలో నేను భగవంతుని చూశాను భగవంతునితో మాట్లాడాను అని మీకు కూడా భగవంతుని చూపిస్తాను. భగవంతునితో మాట్లాడిస్తాను అన్న ఏకైక వ్యక్తి ఒకే ఒక్కరు భగవాన్ శ్రీ రామకృష్ణ పరమ హంస అని ఆయన యొక్క బోధనలు నేటికీ అందరికీ అనుసరణీయమని తెలిపారు. అన్ని మతాలు సత్యాలని అన్ని ఆ భగవంతుని చేరేందుకు వివిధ మార్గాలని ఎవరు ఏ రూపంలో భగవంతున్ని పూజించిన అన్ని ఓకే భగవంతునికి చేరతాయని ఆయన బోధనలు అన్ని మతాలకు ఆదర్శనీయమని తెలిపారు. అంతేకాకుండా ఆయన చేసే ప్రతి బోధన కూడా ఆయన ఆచరించి మాత్రమే చెప్పేవారని తెలిపారు. దుర్లభమైన మానవజన్మ ఎత్తి ఈ జన్మలోనే భగవత్ సాక్షాత్కారం పొందకపోతే మానవ జన్మ నిరర్థకమని ఈ సందర్భంగా ఆయన అన్న మాటలు గుర్తు చేశారు.నేటి తరాలకు స్ఫూర్తి ప్రధాత అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ .స్వరాజ్యం కోసం, ధర్మస్థాపన కోసం ఎంతో పోరాటం చేశారని మొగలలను ఎంతో మంది కరుడు కట్టిన రాజులను సైతం ఎదిరించి వారిని మట్టి కరిపించారని అంతేకాకుండా దేశం కోసం, ప్రాణాలను సైతం అర్పించాలని కూడా ప్రజలకు మంచి సందేశం ఇచ్చారని తెలిపారు .అంతేకాకుండా అలాంటి గొప్ప యోధుడి అడుగుజాడల్లో మనమంతా నడవాలని ఆయన యొక్క ధైర్య సాహసాలు, ఆయన మంచితనం ,అన్యాయాన్ని ఎదుర్కొనే సాహసం, ధర్మస్థాపనకు ఆయన చేసిన పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు . ఈ కార్యక్రమంలో మెడిటేషన్ మాతాజీ టి. ఇందిరా దేవి ,వి. హరిబాబు ,బి. సత్యనారాయణ రాజు, ఎం. చంద్రశేఖర్ రెడ్డి, ఎం. పాపిరెడ్డి, పి. శ్రీనివాసరావు, వి. నాగమణి, ఎస్. కృష్ణవేణి, జి .నాగలక్ష్మి, సుందరమ్మ బికారి నాయక్, బాలాజీ నాయక్ ,మారుతి తదితరులు పాల్గొన్నారు.
Comment List