స్వామి వివేకానంద సేవాశ్రమంలో యోగ మొదటి బ్యాచ్ ముగింపు ఉత్సవాలు
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఫిబ్రవరి 27 :శ్రీ రామకృష్ణ సేవాసమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో శ్రీశైలం రోడ్ లో గల స్వామి వివేకానంద సేవాశ్రమంలో యోగ మొదటి బ్యాచ్ ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు శ్రీ రామకృష్ణ సేవాసమితి అధ్యక్షులుమెట్టు గోవింద రెడ్డి తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్. కే. బి ఆర్ డిగ్రీ కళాశాల కంప్యూటర్ లెక్చరర్ భారతి గారు హాజరయ్యారు. మన దైనందిన జీవితంలో ప్రతిరోజు యోగా ,ప్రాణామయం, మెడిటేషన్ మీరు చేస్తూ ఉంటే మీలో ఉన్న శారీరిక, మానసిక సమస్యలన్నీ తొలగిపోతాయని మీ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. అంతేకాకుండా శరీరానికి వ్యాయామం ఎలా అవసరమో మనసుకు కూడా వ్యాయామం మెడిటేషన్ అని కాబట్టి తప్పనిసరిగా ప్రతిరోజు యోగ, ప్రాణామాయాలు, మెడిటేషన్ చేయాలని ఈ సందర్భంగా భారతి పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న మెట్టు గోవిందరెడ్డిని ఈ సందర్భంగా ఆమె అభినందించారు. శ్రీ రామకృష్ణ సేవాసమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ 2025 జనవరి 26న ప్రారంభించిన ఈ మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమం 2025 ఫిబ్రవరి 27 తారీఖున ముగింపు చేస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెడిటేషన్ మాతాజీ టి. ఇందిరా దేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ యోగా ఉచిత శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత అనుభూతిని పొంది శారీరక, మానసిక సమస్యలను కొంతవరకు తీర్చుకోగలిగారని, అంతేకాకుండా ఆహార విషయంలో కూడా నియమ నిబంధనలను పాటించి ఈ శిక్షణలో పాల్గొని మంచి ఫలితాలు సాధించారని తెలిపారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులందరూ మెడిటేషన్ మాతాజీ ఇందిరా దేవి గారిని, ముఖ్య అతిథి భారతీ మేడం గారిని మరియు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్మ్ మెట్టు గోవింద రెడ్డి గారిని ఘనంగా సన్మానించారు.ఈ ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం రెండో బ్యాచ్ 2025 మార్చి 3 తారీకు నుండి ప్రారంభిస్తున్నట్లు గోవిందరెడ్డి తెలిపారు. పాల్గొనదల్చినవారు వెంటనే ఈ క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించగలరని తెలిపారు.9440006813,9346162835.
Comment List