ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు

ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి మార్చి 16 :పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గం,మండల కేంద్రమైన కారంపూడి పట్టణంలో పొట్టి శ్రీరాములుగారి 124 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెచ్చ వరలక్ష్మణరావు మాట్లాడుతూ భాషా ప్రతిపత్తితో తెలుగు రాష్ట్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు విడిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. స్వాతంత్ర్యం అనంతరం తెలుగు రాష్ట్రాన్ని కూడా తమిళనాడులో కలపటం వలన తెలుగు ప్రజలకు గుర్తింపు లేకుండా పోయిందని, అలాగే తెలుగు మాట్లాడే ప్రదేశాలలో అభివృద్ధికి నోసుకోవడం లేదని  భావించిన తెలుగు రాష్ట్ర నాయకులు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాలు చేస్తున్న సమయంలో శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి, అప్పటి కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించి ఆంధ్ర రాష్ట్రాన్ని అవతరింపజేసిన మహనీయుడని కొని ఆడారు. తెలుగుదేశం నాయకులు ఎస్ఎస్ఆర్ కృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అసువులు బాసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు అని అన్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం వారు తెలుగువారి పోరాటాలను లెక్కచేయక, తెలుగు నాయకులకు విలువను ఇవ్వక అహంకార దోరనిలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా మద్రాస్ నడిబొడ్డున శ్రీరాములు గారు నిరాహార దీక్షకు పోనుకొనుగా, అది నచ్చని మద్రాసు వారు అక్కడ నిరాహారదీక్ష చేయనివ్వకుండా శిబిరాన్ని ధ్వంసం చేయగా, వారు నివాసం ఉంటున్న గృహంలోనే ఆమరణ నిరాహార దీక్షను 58 రోజులు కొనసాగించి అమరులైన పొట్టి శ్రీరాములు గారిని, కనీసం పట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువారు రాని దుర్భర స్థితిలో ఆయన శవం ఉండగా, గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తన పాటలతో చైతన్యవంతులను చేస్తున్న సమయంలో టంగుటూరి ప్రకాశం పంతులుగారు మద్రాసు వచ్చి వేశం కట్టలు తెంచుకొని తెలుగువారిపై కోపోద్రేకంతో మాట్లాడిన మాటలకు,మద్రాస్ రెసిడెన్సి కాలేజీలో ఉన్న తెలుగు వారు ఆవేశం కట్టలు తెంచుకొని మద్రాసు నగరాన్ని మంటలతో ముంచేత్తి శ్రీరాములు గారి ప్రాణ త్యాగానికి సమాధానం చెప్పారన్నారు. అంతటి మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు గారిని మరిచిపోవటం కానీ, ఆయనకి ఇవ్వవలసిన గౌరవాన్ని మనం ఇవ్వలేనప్పుడు,ఒక విధంగా మనల్ని కూడా మదరాశీల కిందనే లెక్క కట్టుకోవాల్సి వస్తుందని కృష్ణ ఆవేదనతో  మాట్లాడారు. ఇంతటి మహానుభావులు ఎందరోప్రాణ త్యాగం చేసిన ఈ రాష్ట్రంలో మనము ఉండటం మన అదృష్టం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మద్ది హనుమంతరావు, ఎక్కల శ్రీనివాసరావు, కజ్జం ప్రసాదరావు, మిత్తింటి సాంబశివరావు, కందుకూరి వెంకటేశ్వర్లు, ఇంకా ఆర్యవైశ్య సంఘ పెద్దలు నాయకులు పాల్గొన్నారు.

Tags:
Views: 4

Advertisement

Latest News

చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది... చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
డ్రగ్స్ వద్దు బ్రో"   ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
ఘనంగా పొట్టి శ్రీరాములుగారి 124వ జయంతి వేడుకలు
ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
శిధిలా వ్యవస్థలో ఉన్న 800 సంవత్సరాల దేవాలయం పున ప్రతిష్ట కార్యక్రమం చేపట్టిన జంగా
కడప జిల్లా... పోరుమామిళ్ల పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం...