అడిగొప్పల లో లెదర్ పార్క్ అభివృద్ధి కొరకు పాటుపడుతున్న నరసరావుపేట ఎంపీ
లావు శ్రీకృష్ణదేవరాయలుకి ధన్యవాదములు-పేరు పోగు రామయ్య
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 13:పల్నాడు జిల్లా, దుర్గి మండలం ,పల్నాడు జిల్లా ఎమ్మార్పీఎస్ కన్వీనర్ పేరుపోగు రామయ్య మాట్లాడుతూ గతంలో అప్పటి ఇప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబునాయుడు పల్నాడు ప్రాంతంలో దళితుల అభివృద్ధి చెందాలని లెదర్ పార్క్ దుర్గి మండలం అడిగోప్పల గ్రామంలో నిర్మాణం చేపట్టి ఎంతోమందికి శిక్షణ ఇచ్చి నిరుద్యోగ భృతి కల్పించే క్రమంలో టిడిపిప్రభుత్వం మారటం వల్ల అడిగొప్పల లెదర్ పార్కు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఘోరంగా తయారి అయింది ఈ మధ్యకాలంలో లెదర్ పార్కు చైర్మన్ పిల్లి మాణిక్యరావు కు లెదర్ పార్క్ విషయం తెలియజేయడం జరిగింది.ఈ క్రమంలో మన నరసరావుపేట ఎంపీ చోరవ తీసుకొని లెదర్ ఇండస్ట్రీస్ మినిస్టర్ పీజీ భరత్ లెదర్ ఇండస్ట్రీస్ జిఎం తో మాట్లాడటం హర్షించదగ్గ విషయం కనుక ప్రభుత్వం త్వరగా పల్నాడు ప్రాంతమైన అడిగొప్పుల దగ్గర లెదర్ పార్కును పున: ప్రారంభించాలని ప్రాంత ప్రజలు మరి ముఖ్యంగా మాదిగ యువకులు కోరుకుంటూ అలాగే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు
Comment List