చదువు" కొనడం '' అప్పుడే మొదలయ్యింది...
ఎల్ కే జి, యు కే జి లకు పాఠశాలల ముందు హౌస్ ఫుల్ బోర్డ్లు - డొనేషన్లు వసూలు చేస్తున్న విద్య సంస్థలు
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
ఐ ఎన్ బి టైమ్స్ విజయవాడ మార్చి 24 : పాఠశాలలు, కార్పొరేట్ విద్యాసంస్థలు మళ్లీ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పిల్లలకు మంచి చదువును అందించాలని కోరుకునే తల్లిదండ్రుల రక్తం తాగేందుకు అడ్మిషన్స్ ఓపెన్ అనే బోర్డ్ ల తో ఎదురుచూస్తున్నారు.ఒక్కో పాఠశాలాది ఒక్కో స్టైల్ , విజయవాడలోని నలంద బ్లూమింగ్ డైల్ స్కూల్ లో , ఎల్ కే జి లో అడ్మిషన్ కోసం అడిగితే అక్షరాల ఒక లక్ష పదివేల రూపాయలు చెప్పారు. అదేవిధంగా విజయవాడలోని సిద్ధార్థ స్కూల్ కి వెళ్లి ఎల్కేజీ లో జాయిన్ చేయడానికి ఫీజు వివరాలు అడగగా 40 వేల రూపాయలు డొనేషన్ 48 వేల రూపాయలు ఫీజు అని చెప్పారు . ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వారు తమ తమ ఫీజులను నిర్ణయించుకుంటూ పోతుంటే ఒక మధ్యతరగతి తల్లిదండ్రులు వారి పిల్లలని ఎలా చదివించుకోగలరు, భారతదేశంలో చదువు - వ్యాపార నిషేధం అలాంటిది ఇక్కడ బాగా సంపాదించాలంటే రంగుల గోడలు, అద్దాలమేడలు, అబద్ధాల మాటలు, ఇలాంటి వాటితో ఒక మధ్యతరగతి తల్లిదండ్రులకు కార్పొరేట్ విద్యాసంస్థలు ఏరవేస్తున్నాయి . ఎల్ కే జి కి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేయడానికి ప్రభుత్వం వీరికి మరి ఎలాంటి ప్రత్యేకమైన అనుమతులను ఇచ్చిందో, లేదా సంవత్సరానికి ఇంత లాభం గడించాలని ముందుగానే వేసుకున్న లెక్కల ప్రకారం గా ఫీజులు నిర్ణయించుకుంటున్నారు తెలియదు కానీ తల్లిదండ్రులు వారి గుమ్మం తొక్కడమే ఆలస్యం వీళ్లు చెప్పే ఫీజుల కు కళ్ళు బైర్లు కమ్మాల్సిందే.. ప్రతి సంవత్సరం ఈ తంతు షరా మామూలె అన్నట్టుగా నడుస్తుంది. ఇకనైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాఠశాలలు విద్యాసంస్థల ఫీజులపై నియంత్రణను సూచించాలని జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో ఫీజుల వివరాలు గవర్నమెంట్ ఆమోదంతో విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద వసూలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు
Comment List