ఆత్మగౌరవానికి అద్వితీయంగా పట్టాభిషేకం.. -హట్టహాసంగా వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ
టీడీపీకి నిబద్దతో సేవలు అందించింది వడ్డెర్లే -ఎమ్మెల్యే జూలకంటి --నా గెలుపులో వడ్డెర్ల పాత్రను ఎన్నడూ మరవను - ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి మార్చి 16 :మాచర్లపట్టణంలోని మున్సిపల్ కూడలి నందు నూతనంగా నిర్మించిన వడ్డెర్ల ఆత్మగౌరవం వడ్డెర ఓబన్న విగ్రాహావిష్కరణ కార్యక్రమం ఆదివారం హట్టహాసంగా జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిధులకు వడ్డెర సాధికార సంఘం ఆధ్వర్యంలో స్థానిక పార్క్ సెంటర్ నుంచి భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఓబన్న విగ్రహం వరకు అడుగడుగునా జన నీరాజనాల నడుమ ర్యాలీ తీశారు. అనంతరం వేదమంత్రోచ్ఛరణలు, భారీ జయజయ ధ్వానాలతో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, వడ్డెర్ల ఆత్మగౌరవం స్వర్గీయ ఓబన్న నూతన విగ్రహావిష్కరణోత్సవం కన్నుల పండుగగా సాగింది. అనంతరం ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వడ్డెర ఆత్మగౌరవ చైతన్య సదస్సులో ముఖ్య అతిధులు పాల్గొని మాట్లాడారు. *టీడీపీకి నిబద్దతో సేవలు అందించింది వడ్డెర్లే -ఎమ్మెల్యే జూలకంటి* తెలుగుదేశం పార్టీ ఆవిర్బవించిన నాటి నుంచి పార్టీకి వెన్నుదండుగా నిలవడమేకాకుండా ఎంతో నిబద్దతో పనిచేసింది వడ్డెర సామాజీకవర్గీయులేనని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గుర్తు చేశారు. తన గెలుపులో ప్రముఖ పాత్ర పోషించిన వడ్డెర సామాజీకవర్గాన్ని అన్ని విధాలుగా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. టీడీపీ అంటేనే మా పార్టీ, పార్టీ అంటే మేమే అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డెర సామాజీకవర్గం 2024 సాధరణ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేశారని స్పష్టం చేశారు. చరిత్రలో చిరస్మరణీయుడైన తెలుగు రత్నం ఓబన్న వారసులుగా ఉన్న వడ్డెర్లకు తెలుగుదేశం ద్వారానే రాజకీయ ప్రాధాన్యత దక్కుతోందిన ఆయన భరోసా ఇచ్చారు. సామాజీకవర్గాల్లో సంస్కరణలు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీలో వడ్డెర్లకు కచ్చితంగా సముచిత స్ధానం ఉంటుందని ఆయన చెప్పారు. రాజకీయ రిజర్వేషన్ ప్రతిపాదనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి తనవంతుగా తోడ్పాటును అందిస్తానని హామీ ఇచ్చారు.
*నా గెలుపులో వడ్డెర్ల పాత్ర ఎన్నడూ మరవను – ఎంపీ లావు* నరసరావుపేట ఎంపీగా రెండు పర్యాయాల విజయంలో వడ్డెర్ల పాత్ర ఎంతో కీలకమని లావు శ్రీ కృష్ణదేవరాయలు గుర్తు చేసుకున్నారు. శరీరాన్నే ఆయుధంగా మల్చుకుని ఓబన్న చేసిన స్వాతంత్ర్య పోరాటం అందరికీ ఆదర్శమన్నారు. రాజకీయ ప్రాధాన్యతతో పాటు క్వారీల్లోనూ, ఇసుక రవాణలో వడ్డెర సామాజీకవర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించడంలో తన వంతు కృషి ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అలానే సత్రశాల నందు వడ్డెర సామాజీకవర్గం నూతనంగా నిర్మించిన సత్రానికి నిధులు మంజూరు చేసి, అభివృద్ధికి సహకరిస్తానని ఎంపీ లావు భరోసా ఇచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా వడ్డెర్లు ఎదగేలా కావాల్సిన సబ్సిడి రుణాలను బ్యాంకు ద్వారా అందించడంలో తనవంతు సహకారం ఉంటుంది ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మాచర్ల నడిబొడ్డున వడ్డెర్ల ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలబెట్టేందకు కృషి చేసిన ప్రతిఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్రాధ్యక్షుడు ఎం.ధారు నాయక్, తెలుగుదేశం పార్టీ మాచర్ల పట్టణ అధ్యక్షుడు కొమెర దుర్గారావు, మున్సిపల్ చైర్మన్ పోలూరి నర్సింహారావు, వడ్డెర సాధికార సంఘం పెద్దలు, నియోజకవర్గ స్ధాయి తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comment List