ముటుకూరు లోని గోపయ్య స్వామి వారి కల్యాణ మహోత్సవం.
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 11: పల్నాడు జిల్లా, దుర్గి మండలంలోని ముటుకూరు గ్రామం నందు వెంచేసియున్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్చకులు, వేదపండితులు స్వామివారి విగ్రహాలకు ప్రత్యేక అలంకరణలు చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలతో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారికి తీర్థ ప్రసాదాలను సమర్పించారు. ఆలయ ధర్మకర్త కుటుంబ సపరివార సమేతంగా వచ్చి స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త లింగా బ్రహ్మయ్య దంపతులు మరియు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Views: 3
Latest News
24 Mar 2025 23:58:44
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
Comment List