బాబోయ్. మాకు లైటింగ్ ఏర్పాటు చేయండి ప్రాజెక్టు మేనేజర్ ప్రసాద్ కి విన్నపం
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి గురజాల నియోజకవర్గం పల్నాడు జిల్లా పిబ్రవరి 13:అద్దంకి నార్కెట్పల్లి హైవే క్యూబ్ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ ప్రసాద్ దాచేపల్లి నగర పంచాయతీ ప్రజలు మరియు నగర పంచాయతీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ , షరీఫ్ విన్నపo చేస్తున్నారుదాచేపల్లి నగర్ పంచాయతీ ఆర్ అండ్ బి బంగ్లా సెంటర్ రాజధాని షూమార్ట్ దగ్గర నుండి దాచేపల్లి పాత బస్టాండ్ సెంటర్ వరకు హైవే మీద కరెంటు స్తంభాలు లేక చిమ్మ చీకటిగా ఉన్న కారణంగా ప్రమాదాలు జరుగుతా ఉంటే, గత సంవత్సరం తమరి దృష్టికి ఈ సమస్యని తీసుకురావడంతో, పాత బస్టాండ్ సెంటర్లో మాత్రమే కరెంటు స్తంభాలు ,లైటింగ్ ఏర్పాటు చేశారు. రాజధాని షూ మార్ట్ దగ్గర నుండి నాగులేరు వంతెన వరకు కరెంటు స్తంభాలు వేయలేదు. ఇప్పటికీ కూడా అంధకారంలోనే ఉంటున్నారు. వాహనదారులు, పాద చారులు ఇబ్బందులు పడుతున్నారు సాధ్యమంత త్వరగా సమస్యను పరిష్కరించి ప్రజలు ఇబ్బందిని తీర్చవలసిందిగా కోరుతున్నారు
Comment List