డ్రగ్స్ వద్దు బ్రో" ప్లే కార్డులతో ప్రజలకు అవగాహన కార్యక్రమం
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి గురజాల నియోజకవర్గం మార్చి 17: దాచేపల్లి పోలీసులు నడికుడి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో "డ్రగ్స్ వద్దు బ్రో" అనే నినాదంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే తీవ్ర పరిణామాలు గురించి ప్రజలకు వివరించడంతో పాటు, వాటి దూరంగా ఉంచాలని సూచనలు ఇవ్వటం జరిగిందిఈ కార్యక్రమంలో దాచేపల్లి సీఐ భాస్కర్, ఎస్ ఐ . పాపారావు మరియు సౌందర్ రాజన్ పాల్గొని, ప్రజలను డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, యువత భవిష్యత్తును రక్షించుకోవాలని కోరారు.దాచేపల్లి పోలీసులు డ్రగ్-రహిత సమాజ నిర్మాణం కోసం కట్టుబడి, భవిష్యత్తులో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే, Eagle Teams మరియు 1972 టోల్ ఫ్రీ నెంబర్ గురించిన వివరాలను ప్రజలకు తెలియజేశారు.
Tags:
Views: 1
Latest News
24 Mar 2025 23:58:44
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
Comment List