దుర్గి మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం*
ప్రిన్సిపాల్ పి. బాలస్వామి
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 22:పల్నాడు జిల్లా,దుర్గి మండలం లోని2025-2026 విద్యా సంవత్సరానికి గాను ఏపీ మోడల్ స్కూల్లో ఆరవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి బాలస్వామి తెలిపారు.ఈనెల 24వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా పరీక్ష రుసుమును చెల్లించి దరఖాస్తులు వెబ్సైట్ నందు చెల్లించాలని పేర్కొన్నారు.అలాగే పరీక్షకు ఓసి బిసి విద్యార్థులకు 150 /- ఎస్సీ, ఎస్టీలకు 75 రూపాయలు చెల్లించాలని వెల్లడించారు.విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదవ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలన్నారు.ఓసి,బీసీ విద్యార్థులు 01-09-2013 నుంచి 31-08-2015 మధ్య జన్మించిన వారు అర్హులని ఆయన వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రియల్ 20న ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు తెలుగు ఇంగ్లీష్ మీడియం లో ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందనిఈ పరీక్షలో ఓసి బీసీ విద్యార్థులకు 35 మార్కులు ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు 30 మార్కులు నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ బాలస్వామి మాట్లాడారు.విద్యార్థులు ప్రవేశ పరీక్షలో చూయించిన ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్ రూల్స్ కు లోబడి ప్రవేశాలు కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఈ పరీక్ష పై మరింత సమాచారం కోసం9160649929 9440726818 నంబర్లకు ఫోన్ చేయవచ్చని ప్రిన్సిపాల్ పి బాలస్వామి తెలిపారు.
Comment List