సెల్ఫీ ఫోటో పంపించి సచివాలయ ఉద్యోగి...అయ్యా. నన్ను క్షమించండి
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి మార్చి 4:పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి సచివాలయం -3 వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీ ప్రసాద్ గత 3 రోజుల క్రితం ఒకటవ తేదీన వృద్ధులు ,వికలాంగులు వితంతువులకి పంపిణీ చేయవలసిన 11 లక్షల 12500 రూపాయల పెన్షన్ డబ్బులతో పారాయడు. దీనితో దాచేపల్లి కమిషనర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు తాజాగా వెల్ఫేర్ అసిస్టెంట్ సంపతి లక్ష్మీప్రసాద్ సెల్ఫీ వీడియో ద్వారా తప్పును ఒప్పుకున్నాడు ఆన్లైన్ బెట్టింగులు చేసి డబ్బులు పోగొట్టుకొని మోసపోయానని తాను చేసిన తప్పుకు రెండు రోజులుగా తమ భార్య పిల్లలు ఏమీ తినలేదని వాపోయాడు తనకు ఒక నెల రోజులు గడువు ఇస్తే తన తల్లిదండ్రులను అడిగి తిరిగి నగదును చెల్లిస్తానని మరల ఇటువంటి తప్పు పురావతం కాకుండా చూసుకుంటానని ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డామని జిల్లా కలెక్టర్ దాచేపల్లి కమిషనర్ వారు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు
Comment List