యాచకులకు, వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ

యాచకులకు, వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి మార్చి 30 :స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో యాచకులకు, వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేస్తున్న మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్  మరియు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి.స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ పదవ వార్షికోత్సవము మరియు నూతన తెలుగు సంవత్సరాది విశ్వా వసు నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని 30.3. 2025 ఆదివారం యాచకులకు మరియు వృద్ధులకు నూతన వస్త్రధానము మరియు అన్నదానం నిర్వహించినట్లు స్వామి వివేకానంద చారీటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పూజ్యులు పెద్దలు మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్  హాజరై ముందుగా అందరికీ పేరుపేరునా నూతన విశ్వావసు తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేశారు . అనంతరం స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్జి  మాట్లాడుతూ సమాజంలో ఎలాంటి సహాయము పొందలేని స్థితిలో ఉండి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న యాచకులకు, వృద్ధులకు ప్రతినిత్యము స్వయంగా వారి దగ్గరికి వెళ్లి మూడు పూటలా అన్నదానం చేస్తున్న మెట్టు గోవిందరెడ్డి సేవలు వెలకట్టలేనివి అని కొనియాడారు. అంతేకాకుండా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మా మండల న్యాయ సేవా కమిటీ సభ్యులు మెట్టు గోవింద రెడ్డికి లిఖితపూర్వకంగా అందజేసిన సో మేము వాటిని వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రతి ఒక్క మనిషికి కూడు, గుడ్డ, నీరు బతకడానికి అవసరమని మీరు స్వేచ్ఛగా జీవించే హక్కు అందరికి సమానంగా ఉన్నదని కాబట్టి మీరు ఎలాంటి ఈవక్షకు లోను కాకుండా మా మండల న్యాయ సేవా కమిటీ ద్వారా ఉచిత న్యాయం పొందవచ్చు అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర మరియు చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద చెప్పిన విధంగా వారు నారాయణులని  తలంచి వారికి సేవ చేయాలని వారే కనిపించే ప్రత్యక్ష దైవాలని తెలిపారు. ఒక అనాధకు అన్నం పెట్టలేని ఒక వితంతువు కన్నీటిని తూడవలేని ఏ మతాన్ని గాని, ఏ దైవాన్ని గాని నేను నమ్మను అని ఈ శాస్త్రాలను పురాణాలను గంగలో పారవేయమన్న స్వామి వివేకానంద సూక్తులు ఈ సందర్భంగా గోవిందరెడ్డి గుర్తు చేశారు . అనంతరం జడ్జిగారు శ్రీనివాస్ కళ్యాణం  చేతుల మీదుగా వందమంది యాచకులకు ,వృద్ధులకు వస్తదానం చేసి అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమం అనంతరం స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి చిన్నారులకు సభ్యులందరికీ , ప్రజలకు భోజన ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వరల్డ్ బీయింగ్ ఫౌండేషన్ చైర్మన్ శాంతి బాయి టీచర్  వ్యవహరించారు.  ఈ కార్యక్రమంలో పల్నాడు ప్రతిభ వికాస్ కాలేజీల డైరెక్టర్ షేక్ నాగర్ వలి ,ఐఐటి ,జేఈఈ మెయిన్స్, ఎంసెట్ కోచింగ్ టీచర్ ఆవుల ఆంజనేయులు, హెడ్ మాస్టర్ పాపి రెడ్డి, హరి బాబు, శ్రీనివాస్, నాగలక్ష్మి, నాగమణి, రామాంజనేయులు ,మంగమ్మ, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్,చింతలపూడి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బత్తుల ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 2

Advertisement

Latest News

మాచర్ల అభివృద్ధిలో జూలకంటి మార్క్..! మాచర్ల అభివృద్ధిలో జూలకంటి మార్క్..!
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల నియోజకవర్గ ప్రతినిధి మార్చి 31: మాచర్ల నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.అనునిత్యం నియోజకవర్గ...
ముస్లీం మహిళల సాధికారతే లక్ష్యం
అధైర్యపడవద్దు ఆదుకుంటాం : జూలకంటి బ్రహ్మానందరెడ్డి
ఘనంగా ఉగాది పండగ 
యాచకులకు, వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి
సమృద్ధిగా వర్షాలు : జూలకంటి బ్రహ్మానందరెడ్డి