ముస్లీం మహిళల సాధికారతే లక్ష్యం

 మీ సమస్యలన్నీ సెప్టెంబర్ నాటికి తీరుస్తా.- జెండా చెట్టుతో విడదీయరాని బంధం మాది.

ముస్లీం మహిళల సాధికారతే లక్ష్యం

పవిత్ర రంజాన్ సందేశం అందించిన ఎమ్మెల్యే జూలకంటి.

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి మార్చి 31 :పేద ముస్లీం మహిళలకు స్వయం ఉపాధి, ఆర్ధిక స్వావలంబనే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురష్కరించుకుని సోమవారం స్థానిక పాతూరులోని ఈద్గా ప్రాంగణంలో వేలాది మంది ముస్లీం సోదర్లతో కలిసి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు జూలకంటి. అనంతరం మస్జీద్ అభివృద్ధికి రంజాన్ కానుకగా తనవంతు రూ.లక్ష నగదును విరాళంగా అందజేశారు. అనంతరం ముస్లీం సోదర్లకు రంజాన్ సందేశాన్ని ఇచ్చారు. జెండా చెట్టు బజారుతో జూలకంటి కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని గుర్తు చేసుకున్నారు. నూర్ మస్జీద్, షాదీఖానా, కబరస్ధాన్ నిర్మాణాలకు ఆనాటి ఎమ్మెల్యేగా ఉన్న జూలకంటి దుర్గాంబ ఎంతో కృషి చేశారని వివరించారు.మండాది రోడ్డులో ఉన్న స్థల వివాదంపై సర్వే చేయిస్తా!రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గాకు వచ్చిన ఎమ్మెల్యే జూలకంటికి ముస్లీంలు అనాది ఎదుర్కోంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. జమ్మలమడక గ్రామంలో, మండాది రోడ్డు ఎస్కేబీఆర్ కళాశాల వద్ద ఉన్న మస్జీద్ స్థలాలు అన్యాక్రాంతం అయ్యాయని, వాటిని పరిష్కరించాలని ముస్లీంలు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన జూలకంటి.., ఆ స్థలాలను సర్వే చేసి.., గుర్తించేలా తక్షణమే తహశీల్దార్ ను ఆదేశిస్తానని హామీ ఇచ్చారు. అలానే ఖబరస్థాన్ చుట్టూ ప్రహరి నిర్మాణానికి ప్రభుత్వ నిధులు కేటాయించి, అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈద్గా ప్రాంగణంలో బోరు వేయించి.., తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని చెప్పారు. సెప్టెంబర్ నాటికి జనాజాకు ప్రత్యేక వాహనం అందిస్తా!మాచర్ల పట్టణంలో నలుగు దిక్కులు ముస్లీంలు వ్యాపించి ఉన్నారని.., వారి అంతిమ యాత్రకు కిలోమీటర్ల దూరం నుంచి ఖబరస్థాన్ కు వాహనాలపై పార్థివ దేహాలను తీసుకురావాలంటే ఆర్ధికంగా మోయరాని భారంగా ఉంటుందని ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డికి ముస్లీంలు విన్నివించారు. దీనిపై స్పందిస్తూ .. ముస్లీంల జనాజాకు ప్రత్యేక వాహనం ఒకటి సెప్టెంబర్ నాటికి అందుబాటులో ఉంచుతానని హామీ ఇచ్చారు. ప్రత్యేక వాహనంతో పాటు పర్మెనెంట్ డ్రైవర్ ను, పార్థివ దేహాన్ని భద్రపరిచే ఫీజర్ ను కూడా అందజేస్తానని మాట ఇచ్చారు. త్వరలో మాచర్లలో ఉన్న ఖబరస్థాన్ ను కూడా సందర్శించి..,అక్కడున్న సమస్యలపై  గుర్తించి.., ప్రణాళికలు సిద్ధం చేస్తానని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.  రంజాన్ ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో ముస్లీం మత పెద్దలు, మాచర్ల పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:
Views: 6

Advertisement

Latest News

మాచర్ల అభివృద్ధిలో జూలకంటి మార్క్..! మాచర్ల అభివృద్ధిలో జూలకంటి మార్క్..!
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల నియోజకవర్గ ప్రతినిధి మార్చి 31: మాచర్ల నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.అనునిత్యం నియోజకవర్గ...
ముస్లీం మహిళల సాధికారతే లక్ష్యం
అధైర్యపడవద్దు ఆదుకుంటాం : జూలకంటి బ్రహ్మానందరెడ్డి
ఘనంగా ఉగాది పండగ 
యాచకులకు, వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి
సమృద్ధిగా వర్షాలు : జూలకంటి బ్రహ్మానందరెడ్డి