మాచర్ల అభివృద్ధిలో జూలకంటి మార్క్..!

ఆగని నిధుల ప్రవాహం ....ఇన్నర్ రింగ్ రోడ్డు విస్తరణకు రూ.54.09 కోట్లు నిధులు

మాచర్ల అభివృద్ధిలో జూలకంటి మార్క్..!

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల నియోజకవర్గ ప్రతినిధి మార్చి 31: మాచర్ల నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.అనునిత్యం నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులను ప్రవాహంలా తీసుకొచ్చి నియోజకవర్గం  సర్వతోముఖాభివృద్ధి చేసేందుకు దృఢ సంకల్పంతో ఉన్నారు.ఈ నేపథ్యంలో సోమవారం తాజాగా జాతీయ రోడ్డు రవాణా హైవే అథారిటీ మంత్రిత్వ శాఖ నుంచి కేంద్రం 54.09 కోట్ల నిధులను మాచర్ల,రెంటచింతల,గురజాల పట్టణాల ఇన్నర్ రింగ్ రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం   మంజూరు చేసింది. మాచర్ల పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రీత్యా టౌన్ ఇన్నర్ రింగ్ రోడ్డును విస్తరణ చేయాలన్నది ప్రజల నుంచి ఎప్పటినుంచో ఉన్న డిమాండ్. ఈ క్రమంలో మాచర్ల పట్టణ ఔటర్ రింగ్ రోడ్డు పనులు దాదాపు పూర్తికావస్తున్న నేపథ్యంలో  సిటీలో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు విస్తరణ పనులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతం చేశాయి. 


 *సెంట్రల్ లైటింగ్ కాంతులతో న్యూ లుక్ తో మాచర్ల!*

 మాచర్ల పట్టణ ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు శరవేగంగా  జరగనున్న నేపథ్యంలో రాయవరం బైపాస్ నుంచి పార్క్ సెంటర్, శ్రీశైలం రోడ్డు వరకు ఉన్న రోడ్డు విస్తరణ పనులు జరగనున్నాయి. మరోవైపు పార్క్ సెంటర్ వెనకవైపు ఉన్న కూరగాయల మార్కెట్ రోడ్డును కూడా  డివైడర్ తో సెంట్రల్ రైటింగ్ పనులు జరగనున్నాయి. మాచర్ల పట్టణంలో జరగనున్న దాదాపు ఆరు కిలోమీటర్ల ఇన్నర్ రోడ్స్ పనులు విషయానికి వస్తే రెండు వైపులా ఇరవై ఏడు అడుగుల వెడల్పుతో రోడ్డు మార్గం, ఐదు అడుగుల వెడల్పుతో సెంటర్ డివైడర్, ఇరువైపులా బార్ గేట్లు, బార్ గేట్ల పక్కన ఐదు అడుగుల వెడల్పుతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం వంటివి రానున్నాయి. రోడ్డు సెంటర్ డివైడర్ పైన సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేస్తారు. త్వరలో దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియను కూడా  పూర్తిచేసి పనులు ప్రారంభించేందుకు అడుగులు పడుతున్నాయి. దీంతో మాచర్ల టౌన్ ప్రజల చిరకాల కోరిక నెరవేరడంతో పాటు  ట్రాఫిక్ సమస్య కు పూర్తిస్థాయిలో చెక్ పడనున్నది.అలానే రోడ్డు విస్తరణతో పాటు సెంట్రల్ లైటింగ్ కాంతులలో మాచర్ల పట్నం న్యూ లుక్ తో కనిపించనున్నది.

*రెంటచింతల ఇన్నర్ రింగ్ రోడ్డుకు మోక్షం!* 

 రెంటచింతల శివారు నున్న బైపాస్ నుంచి పట్టణంలోకి దాదాపు 5 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు విస్తరణ పనులు ఈ నిధుల నుంచే వెచ్చించనున్నారు.గోలివాగు  నుంచి పట్టణంలో ఉన్న ఇన్నర్ రోడ్డును కలుపుకుంటూ గురజాల రోడ్డులో ఉన్న భారత్ పెట్రోల్ బంక్ మీదగా ఇన్నర్ రోడ్డును బైపాస్ కు కలపనున్నారు.రోడ్డు విస్తరణ, డివైడర్,సెంట్రల్ లైటింగ్ తో ప్రస్తుతం ఉన్న రోడ్డును ఆధునికరించనున్నారు.అలానే గురజాల గాడిదల  వాగు సమీపం ఉన్న బైపాస్ నుంచి గురజాల పట్టణంలోకి దాదాపు 6 కిలోమీటర్ల వరకు ఇదే తరహాలో  రోడ్డు విస్తరణ పనులు జరగనున్నాయి.

ఇప్పటికే మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో  నియోజకవర్గానికి  త్రాగు,సాగు నీటి ప్రాజెక్టులకు కేంద్ర  జల్ జీవన్ మిషన్ ద్వారా  రూ. 1200 కోట్లు,అమృత్ స్కీం ద్వారా మాచర్ల పట్టణానికి బుగ్గవాగు నుంచి తీసుకువచ్చే రక్షిత నీటి పథకానికి  మరో 100 కోట్ల నిధులను సాధించి తీసుకొచ్చారు. ఇంకోవైపు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసి పంపడం జరిగినది. మరోవైపు పట్టణ సుందరీకరణకు  2 ఎకరాల్లో గ్రీన్ పార్క్, 10 ఎకరాల్లో క్రీడా మైదానం నిర్మాణాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రణాళిక ప్రతిపాదనలు పంపించడం జరిగింది.తాజాగా మాచర్ల  నియోజకవర్గం ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకు  రూ. 54.09 కోట్లు మంజూరు కావడంతో.. చిత్తశుద్ధితో నియోజకవర్గ అభివృద్ధికి సత్వర నిధులు సాధించి తీసుకురావడంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి చేస్తున్న కృషిని ప్రజలు, పార్టీ నేతలు ప్రశంసిస్తున్నారు.

Tags:
Views: 4

Advertisement

Latest News

మాచర్ల అభివృద్ధిలో జూలకంటి మార్క్..! మాచర్ల అభివృద్ధిలో జూలకంటి మార్క్..!
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల నియోజకవర్గ ప్రతినిధి మార్చి 31: మాచర్ల నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.అనునిత్యం నియోజకవర్గ...
ముస్లీం మహిళల సాధికారతే లక్ష్యం
అధైర్యపడవద్దు ఆదుకుంటాం : జూలకంటి బ్రహ్మానందరెడ్డి
ఘనంగా ఉగాది పండగ 
యాచకులకు, వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి
సమృద్ధిగా వర్షాలు : జూలకంటి బ్రహ్మానందరెడ్డి