దీపం 2.0 పథకం"ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం..తెదేపా నాయకులు
ఐ ఎన్ బి టైమ్స్ రెంటచింతల నవంబర్ 01:దీపం 2.0 పథకంతో ఈ దీపావళి పండుగను మరింత కాంతిమంతం తెలుగుదేశం పార్టీ చేస్తుందని మండల అధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి,మాజీ ఎంపిపి గొంటు సుమంత్ రెడ్డి లు అన్నారు.తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో ప్రధానమైన"దీపం పధకం"ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ లో భాగంగా మొదటి విడత మండల కేంద్రమైన రెంటచింతల లోని
నాయుడు పేట(బి.సి)కాలనీలో తెదేపా నాయకులుపంపిణీ చేశారు.వారు మాట్లాడుతూ తెలుగింటి ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూసేందుకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు.మండలంలో ఉదయం 6 గంటలకే తెలుగుదేశం పార్టీనాయకులు,సచివాలయ ఉద్యోగులతో కలిసి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసారు.అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్ళుగా సీఎం చంద్రబాబు పాలన సాగుతుందనడానికి నేడు జరుగుతున్న పెన్షన్ల పంపిణీ,దీపం పధకం వంటి కార్యక్రమాలే పెద్ద నిదర్శనం అని ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని వారు ఆకాంక్షించారు.ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం ప్రశాంతమైన వాతావరణం లో అభివృద్ధి పథంలో నడుస్తుందని
నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం బ్రహ్మానంద రెడ్డి అని
కావాలనే కొంతమంది కుట్రపన్ని ఎమ్మెల్యే పై విషప్రచారం చెయ్యడం సరికాదని,మరలా ఇటువంటివి పునరావృతం అయితే సహించబోమని, కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు మూలి రాజారెడ్డి,మాజీ ఎంపీటీసీ మర్రి.రాజ్ కుమార్(బాబు), మాజీ పిహెచ్సి చైర్మన్ బొడ్డపాటి రామకృష్ణ,శౌరెడ్డి, ఇన్నారెడ్డి,రాయపరెడ్డి,మల్లయ్య,ముని నాయక్, అందుకూరి.సాగర్ సంగీత్ రావ్(డీలర్),దండే.అంజని కుమార్(డీలర్)తదితరులు పాల్గొన్నారు.
Comment List