ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమం..

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమం..

ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 06:ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.ఈ మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈ.సీ( ఎలక్షన్ కమిషన్)కసరత్తు చేస్తోంది.ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా,గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల నమోదుకు ఎన్నికల కమిషన్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం ఓటరు నమోదు కార్యక్రమం నవంబర్ 06 బుధవారం న ముగిసింది.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదుకు రెంటచింతల మండల వ్యాప్తంగా 985 దరఖాస్తులు స్వీకరించినట్లు మరికొన్ని దరఖాస్తులు వెరిఫికేషన్ లో ఉన్నట్లు తహశీల్దార్ కె.నగేష్ తెలిపారు.ఈ ఎన్నికకు సంబంధించి నవంబర్ 23న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుండగా,డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు,డిసెంబర్ 30న తొలి MLC ఓటర్ల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తహశీల్దార్ తెలిపారు.వీరి వెంట డిప్యూటీ తహశీల్దార్ బ్రహ్మయ్య, రెవిన్యూఇన్స్పెక్టర్(ఆర్.ఐ)పల్లా.రామకృష్ణ,కంప్యూటర్ ఆపరేటర్ రవి,మరియు సిబ్బంది వున్నారు.

Tags:
Views: 10

Advertisement

Latest News

ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 12:సోమవారం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్  2024-2025 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల...
మత్తు వదలని గ్రామాలు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎం.ఆర్.పి.ఎస్ ఆత్మీయ సమ్మేళనన్ని జేయప్రదం చేయండి..గడ్డిపర్తి శ్రీనివాసరావు
26వ తేదీ నుంచి మెగా సప్లిమెంటరీ పరీక్షలు
వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..
జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ రియాక్షన్ ఇదే