ఎన్డీఏ ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు : జూలకంటి
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 05 :రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు లాంటివని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. సోమవారం మాచర్ల పురపాలక సంఘ కార్యాలయంలో దీపం పథకం 2 కింద గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు అందజేశారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమం అభివృద్ధి సమదృష్టితో చూస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతగానో శ్రమిస్తున్నారని అన్నారు. సూపర్ సిక్స్ పథకాల హామీల లో భాగంగా దీపావళి పండుగనాడు దీపం పథకం 2 ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించాడని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు యువ నాయకులు మంత్రి నారా లోకేష్ ఇతర దేశాలలో పర్యటించి పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాడని అన్నారు రాబోవు రోజుల్లో దేశం మన రాష్ట్రం వైపు ఆసక్తిగా చూడబోతున్నారు. గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అంటే ఆమడ దూరం పారిపోయిన పారిశ్రామికవేత్తలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తి కనబడుస్తున్నారని అన్నారు.
Comment List