ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 12:
సోమవారం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్  2024-2025 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల సంక్షేమానికి రూ.4,376 కోట్లు కేటాయించడం పట్ల ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేశారు.మండలకేంద్రమైన రెంటచింతల లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నేత షేక్ బుజ్జి మాట్లాడుతూ చంద్రన్న ప్రభుత్వం ముస్లిం మైనారిటీల కోసం ఇప్పటికే మదర్సా నవీకరణ విద్యా పథకం ప్రవేశపెట్టడం జరిగిందని,
ఉర్దూ టీచర్ల నియామకం ద్వారా భాషాభివృద్ధికి కృషి చేస్తు,మైనారిటీల ఆర్థికాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకుకూడాప్రణాళికలురూపొందించాయన్నారు.ఇమామ్ లకు,మౌజంలకు, ప్రోత్సాహకాలు,మైనారిటీ విద్యార్థులకు విదేశీ విద్యా సాయం కూడా అందుబాటులో ఉంచారని.ముస్లీం మైనారిటీల సంక్షేమం,భద్రత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని మైనారిటీ పిల్లల ఉజ్వల భవిష్యత్ కు సీఎం చంద్రబాబు,డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్‌, విద్యాశాఖ మంత్రి లోకేష్ పనిచేస్తున్నారన్నారు.మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి లో శాసనసభ్యులు జులకంటి బ్రహ్మానంద రెడ్డి నేతృత్వంలో దూసుకెళ్తుందని తెలిపారు.ఈయన వెంట మండల అధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి,మాజీ ఎంపీపీ గొంటు సుమంత్ రెడ్డి,మాజీ పీహెచ్సీ చైర్మన్ బోడపాటి రామకృష్ణ,టౌన్ అధ్యక్షుడు మూలి రాజారెడ్డి,ముస్లిం మైనారిటీ నేతలు,షేక్ ఇమాంస,షేక్ మస్తాన్,షేక్ వలి,కరిముల్లా,సైదా,కూటమి నాయకులు తదితరులు ఉన్నారు.

 

Tags:
Views: 21

Advertisement

Latest News

దుర్గి మండలం లో నేటినుంచి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు దుర్గి మండలం లో నేటినుంచి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి  ప్రతినిధి నవంబర్ 13:పల్నాడు జిల్లా, మాచర్లనియోజకవర్గం,దుర్గి మండలం, దుర్గి గ్రామం  నందుగల గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ది...
నిరుద్యోగి అఖిల్ మనస్థాపంతో రిజర్వాయర్ లోకి దూకి ఆత్మహత్య.
ప్రభుత్వం మారి నెలలు గడిచినా కొత్తరేషన్ కార్డులు ఇచ్చేదెన్నడో..?గతప్రభుత్వం నిబంధనల పేరుతో కొత్త రేషన్ కార్డు జారీ విఫలం
ఘనంగా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం..
ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
మత్తు వదలని గ్రామాలు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున