పిరికివాడివైతే రాజీనామా చేయ్.. జగన్‍కు షర్మిల సవాల్

 పిరికివాడివైతే రాజీనామా చేయ్.. జగన్‍కు షర్మిల సవాల్

ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 08:  వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత సోదరి ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై మచిలీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె స్పందించారు. శాసనసభకు వెళ్లే ధైర్యం లేకపోతే జగన్ రాజీనామా చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మాత్రమే కాదు.. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా అసెంబ్లీకి వెళ్లనంటే.. తమ పదవులకు రాజీనామా చేయాలని షర్మిల సవాల్ విసిరారు. సొంత సోదరుడైనప్పటికీ కొంత కాలంగా రాజకీయంగా జగన్, షర్మిల మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జగన్ వ్యాఖ్యలపై షర్మిల ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నారు. మీడియా సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా అంటూ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వమంటే ఇవ్వడంలేదని, దీంతో తానకు అసెంబ్లీకి వెళ్లే ఉద్దేశం లేదని జగన్ తన మనసులో మాటను బయటపెట్టేశారు. తాజాగా అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే జగన్ రాజీనామా చేయాలంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధ్యక్షులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్యలను చర్చించి, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంలో నిర్ణయాత్మక చర్చలు చేయడానికి శాసనసభ ఓ వేదికగా ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక ప్రతినిధిని అక్కడి ఓటర్లు ఎన్నుకుని తమకు సరైన నాయకుడని భావించిన వ్యక్తిని శాసనసభకు పంపిస్తారు. అధికారపక్షం, ప్రతిపక్షంతో సంబంధం లేకుండా ప్రతి ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఐదేళ్లపాటు తన నియోజకవర్గ ప్రజల కోసం పనిచేయాల్సి ఉంటుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ముఖ్యంగా విపక్ష పార్టీలకు శాసనసభ అనేది ఓ వేదికగా ఉపయోగపడుతుంది. వైసీపీ అధ్యక్షులు జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ హోదాలో శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు హాజరై తనను ఎన్నుకున్న ప్రజల తరపున మాట్లాడాల్సి ఉంటుంది. నియోజకవర్గం సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి ఉంటుంది. కానీ తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలను అవమానిస్తూ.. ఏదో కారణం చెబుతూ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టాలని జగన్ తీసుకున్న నిర్ణయంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల జగన్ నిర్ణయంపై ఘాటుగా స్పందించారు. రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు.అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలంటూ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందిస్తారా.. సైలెంట్‌గా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును ఎవరైనా గౌరవించాల్సి ఉంటుంది. తనకు తక్కువ సీట్లు రావడంతో ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి నీతులు చెప్పే జగన్.. నిబంధనలకు అతీతంగా తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తానని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానించడమో కాదో జగన్ సమాధానం చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది.

 

 

Tags:
Views: 22

Advertisement

Latest News

ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 12:సోమవారం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్  2024-2025 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల...
మత్తు వదలని గ్రామాలు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎం.ఆర్.పి.ఎస్ ఆత్మీయ సమ్మేళనన్ని జేయప్రదం చేయండి..గడ్డిపర్తి శ్రీనివాసరావు
26వ తేదీ నుంచి మెగా సప్లిమెంటరీ పరీక్షలు
వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..
జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ రియాక్షన్ ఇదే