న్యూటన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒకే ఏడాదిలో మూడు ఆత్మహత్యలు

న్యూటన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒకే ఏడాదిలో మూడు ఆత్మహత్యలు

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 03 :మాచర్ల సమీపంలోని న్యూటన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి శనివారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలోని చెట్టూరు మండలం చింతర్లపల్లి గ్రామానికి చెందిన వన్నెల్లి భరత్ కుమార్ (20) న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్సి మొదటి సంవత్సరం చదువుతున్నాడు .పట్టణంలోని విష్ణు ప్రియ కాంప్లెక్స్ పక్కన ఉన్న హాస్టల్లో రూమ్ లో శనివారం మధ్యాహ్నం విద్యార్థులు అందరూ కాలేజీకి వెళ్లిన సమయంలో రూమ్ తలుపుకు లోపల గడి పెట్టుకొని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మాచర్లకు బయలుదేరారు. ఇదిలా ఉండగా ఇదే కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు వరుసగా రెండు మూడు నెలల తేడాతోనే ఆత్మహత్యకు పాల్పడడంతో అసలు ఆత్మహత్యలకు కారణం ఏంటనేది స్పష్టంగా తెలియడం లేదు. ఈ ఏడాది మొదటగా పవన్ అనే విద్యార్థి, మూడు నెలల క్రితం రేణుక అనే విద్యార్థిని, ఇప్పుడు భరత్ కుమార్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి అసలు ఆ కాలేజీలో ఏం జరుగుతుంది..? విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారా..? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణ సిఐ పచ్చిపాల ప్రభాకర్, ఎస్సై జి సంధ్యా రాణి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

Tags:
Views: 28

Advertisement

Latest News

ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 12:సోమవారం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్  2024-2025 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల...
మత్తు వదలని గ్రామాలు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎం.ఆర్.పి.ఎస్ ఆత్మీయ సమ్మేళనన్ని జేయప్రదం చేయండి..గడ్డిపర్తి శ్రీనివాసరావు
26వ తేదీ నుంచి మెగా సప్లిమెంటరీ పరీక్షలు
వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..
జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ రియాక్షన్ ఇదే