మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అంబటిమల్లి
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి నవంబర్ 7:మహేష్ రెడ్డి గారు మీ దృష్టిలో పంట పొలాలను బీడు భూములుగా మార్చటం అభివృద్దారైతులని రైతు కూలీలుగా మార్చడమేనా మీ అభివృద్ది.కర్మాగారం నిర్మిస్తానని భూములు సేకరించి ఏళ్ల తరబడి మీ గుత్తాధిపత్యంలో భూములు ఉంచుకోవడమేనా మీ అభివృద్ధి..అసలు మొదలే కాని ప్రాజెక్టుకి మైనింగ్ లైసెన్సులను 50 సంవత్సరాలకు పొడిగించడం కానీ నీటి కేటాయింపులు చేయడం వంటివి పబ్లిక్ హియరింగ్/ప్రజాభిప్రాయం తీసుకోకుండా అక్రమ మార్గాల ద్వారా లైసెన్స్ పొడిగింపులు నీటి కేటాయింపులు చేసుకోలేదా..రైతులపై బాంబులతో, ట్రాక్టర్లతో దాడులు చేసిన సందర్భాల్లో మీరు మాట్లాడినట్లయితే మిమ్ములను చిత్తశుద్ధి గల నాయకుడిగా భావించేవారము...
కనీసం నియోజకవర్గంలో మీ నాయకుల మైనింగ్ ధన దాహంతో ఎనిమిది మంది చిన్నారులు మృతి చెందితే వారి కుటుంబాలను పరామర్సించి ఆదుకునే ప్రయత్నం ఏనాడైనా చేశారా..బాధ్యత కలిగిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వెనుకబడిన పల్నాడు పై ప్రత్యేక దృష్టి సారించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా నిర్మాణాలు చేపట్టని కర్మాగారాల యాజమాన్యాలపై దశలవారీగా రివ్యూ చేసి చర్యలు చేపడుతుంటే మీరు అసహనం వ్యక్తం చేయడం సిగ్గుచేటు చర్యగా భావిస్తున్నాం.దళితుల అసైన్ భూములను బెదిరించి భయపెట్టి లాక్కోవడం నిజం కాదాచెరువులు కుంటలు దారులను ఆక్రమించి సుమారుగా 25 ఎకరాల భూమి చేజిక్కించుకోవడం నిజం కాదా...సుమారు 400 ఎకరాల అటవీ భూమిని రెవెన్యూ భూమి గా మార్చి సరస్వతి పవర్ అండ్ సిమెంట్స్ చేజిక్కించుకోవడంపై ప్రాథమికంగా అధికారులు ఇచ్చిన నివేదికపై ఆయన స్వయంగా పరిశీలించి అక్కడ రైతుల అభిప్రాయాలను సేకరించి అక్కడికక్కడే గౌరవ జిల్లా కలెక్టర్ వారికి పూర్తి నివేదిక అందించమని ఆదేశాలు జారీ చేశారు.నిజా నిజాలు త్వరలోనే బయటికి వస్తాయి.ఈలోపే అవినీతి సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకు కలుగులో దాగున్న ఎలుకలన్నీ ఒకేసారి బయటికి రావడాన్ని ప్రజలు గమనిస్తున్నారు.
Comment List