సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే షెడ్యూల్ ఇదే..

సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే షెడ్యూల్ ఇదే..

ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 07:రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 8 గంటలకు ఆయన తన కుటుంబ సమేతంగా యాదాద్రికి వెళ్లనున్నారు. ఉదయం 8:45 గంటలకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు YTDA అధికారులతో ఆలయ అభివృద్దిపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మూసి పునరుజ్జీవ ప్రజా చైతన్య పాదయాత్ర ప్రారంభించనున్నారు.మధ్యాహ్నం 1 గంటకు వలిగొండ మండలం సంగెం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా చైతన్య పాదయాత్ర చేపడుతారు. మూసీ పరివాహక ప్రాంతంలో 6కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే భీమలింగం, ధర్మారెడ్డి కాల్వలను సందర్శించనున్నారు. అనంతరం మూసి పరివాహక ప్రాంత రైతులతో సమావేశం కానున్నారు. రైతుల యోగా క్షేమాలు అడిగి తెలుసుకోనున్నారు. రైతులతో సమావేశం అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీ చామల కిరణ్ కుమార్, ఎమ్మేల్యే కుంభం అనిల్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.

 

 

 
Tags:
Views: 0

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మాచర్ల అభివృద్ధిలో జూలకంటి మార్క్..! మాచర్ల అభివృద్ధిలో జూలకంటి మార్క్..!
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల నియోజకవర్గ ప్రతినిధి మార్చి 31: మాచర్ల నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.అనునిత్యం నియోజకవర్గ...
ముస్లీం మహిళల సాధికారతే లక్ష్యం
అధైర్యపడవద్దు ఆదుకుంటాం : జూలకంటి బ్రహ్మానందరెడ్డి
ఘనంగా ఉగాది పండగ 
యాచకులకు, వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి
సమృద్ధిగా వర్షాలు : జూలకంటి బ్రహ్మానందరెడ్డి