మాచర్ల పట్టణ ప్రజలకు రక్షిత మంచినీరు అందించడమే మా లక్ష్యం
సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించండి
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 05 :మాచర్ల పురపాలక సంఘ పరిధిలోని ప్రజలకు రక్షిత మంచినీరు అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు సోమవారం పురపాలక సంఘ సమావేశ మందిరంలో మున్సిపల్ సాధారణ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో టేబుల్ అజెండాగా మాచర్ల పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు టెండర్లు పాల్గొని టెండర్లు దక్కించుకొని పనులు ప్రారంభించని టెండర్లను రద్దు చేస్తూ కౌన్సిల్ తీర్మానం చేసింది. పురపాలక సంఘ పరిధిలోని ప్రజలకు నీరును అందించే పంప్ హౌస్ కు సంబంధించి విద్యుత్ పరికరాలు కొనుగోలుకు కౌన్సిల్ ఆమోదం తెలిపారు పురపాలక సంఘ పరిధిలో వీధిలైట్లు ఏర్పాటు చేయుటకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మాచర్ల పట్నంలో వీధులు వెంట తిరుగుతున్న వీధి కుక్కల వలన ప్రజలకు రాబిస్ వ్యాధి సోకకుండా ఉండేందుకు వాటికి వ్యాక్సిన్ వేసేందుకు అందుకు అవసరమైన వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు కొరకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పురపాలక సంఘ పరిధిలో వార్డుల్లోని ప్రధాన మురుగు కాలవల్లో మురుగు ను తొలగించేందుకు టెండర్లు ఖరారు చేసేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పురపాలక సంఘ పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కౌన్సిలర్లు బాధ్యతాయుతంగా కృషి చేయాలని అన్నారు. మురుగు కాలువలలో పూడికతీయుట చెత్త తొలగించుట వీధిలైట్లు తదితర పనుల గురించి పురపాలక సంఘ కార్యాలయ సిబ్బందితో ప్రజలకు నాణ్యమైన సేవలను అందించి వారి మన్నన పొందాలని ఎమ్మెల్యే సూచించారు.
Comment List