రచ్చమల్లపాడు గ్రామంలో స్కూలు విద్యార్థులకు భోజనం ప్లేట్లు, ప్యాడ్స్ అందజేసిన.. ఎమ్మెల్యే జూలకంటి

రచ్చమల్లపాడు గ్రామంలో స్కూలు విద్యార్థులకు భోజనం ప్లేట్లు, ప్యాడ్స్ అందజేసిన.. ఎమ్మెల్యే జూలకంటి

ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి నవంబర్ 01: వెల్దుర్తి  మండల పరిధిలోని రచ్చమల్లపాడు గ్రామంలోని స్కూల్  విద్యార్థులకు సూదుల కోటయ్య, సీతారావమ్మ జ్ఞాపకార్ధంగా సూదుల చిన్న మల్లయ్య, మాచర్ల ఎమ్మెల్యే  చేతుల మీదుగా విద్యార్థులకు భోజన ప్లేట్లను అందజేశారు.పండ్ల ను షేక్ పెద్ద సైదా జ్ఞాపకార్ధంగా షేక్ జానీ సహకారంతో ఎమ్మెల్యే చేతులు మీదుగా విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు ఆరోగ్యంగా,ఆనందంగా ఆహ్లాదకరమైన క్రీడా ప్రాంగణాన్ని అందుబాటులోకి తీసుకొస్తానని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలియజేశారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ తల్లి,తండ్రి,గురువు, దైవం అని గురువు తర్వాతే దైవమని. ఈ విద్యార్థులను చూస్తుంటే పూర్వం రోజులు గుర్తుకొస్తున్నాయని,వారి గురువులు గుర్తుకొస్తున్నారని తెలిపారు. అలాగే మొదటి నుండి పల్నాడు ప్రాంతం వెనుకబడిన ప్రాంతంగా ఉందని విద్యార్థులు చదువుపై దృష్టి సారించి గొప్ప చదువులు చదివి మన పల్నాడు ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకురావాలని ఆయన మనసారా ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూదుల చిన్న మల్లయ్య టిడిపి యువ నాయకులు, సూదుల నారాయణ, షేక్ జానీ, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Tags:
Views: 30

Advertisement

Latest News

ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 12:సోమవారం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్  2024-2025 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల...
మత్తు వదలని గ్రామాలు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎం.ఆర్.పి.ఎస్ ఆత్మీయ సమ్మేళనన్ని జేయప్రదం చేయండి..గడ్డిపర్తి శ్రీనివాసరావు
26వ తేదీ నుంచి మెగా సప్లిమెంటరీ పరీక్షలు
వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..
జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ రియాక్షన్ ఇదే