విజయసాయి.. శాంతితో డీల్ కుదిరిందా

 విజయసాయి.. శాంతితో డీల్ కుదిరిందా

ఐ ఎన్ బి టైమ్స్  విజయవాడ, నవంబర్ 7: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై  టీడీపీ నేత బుద్దా వెంకన్నమరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి అనే చిత్తకార్తి కుక్క మళ్లీ మొరగడం మొదలు పెట్టిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర 34 సీట్లలో 32 సీట్లు కూటమి అభ్యర్ధులు గెలిచారని.. జగన్‌కు పాఠాలు నేర్పే ఆర్థిక నేరస్తుడు విజయసాయి వల్ల వైసీపీ రెండు సీట్లకే పరిమితం అయ్యిందన్నారు. శాంతి వ్యవహారంలో ప్రెస్టేషన్‌లో ఉన్నాడని తామూ వదిలేశామని.. శాంతితో డీల్ కుదిరి ఉంటుందని.. అందుకే ఇప్పుడు నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. మీడియాలో ఉన్న చీఫ్ రిపోర్టర్లను కూడా ఇష్టం వచ్చినట్లు దూషించిన సంస్కారహీనుడన్నారు. కనీస జ్ఞానం లేని చదువుకున్న మూర్ఖుడు విజయసాయిరెడ్డి అంటూ విరుచుకుపడ్డారు.‘‘శాంతి భర్త నీ మీద చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతావు. ఆయన చెప్పిన అంశాలనే మీడియా కూడా రాసింది కదా’’ అని అన్నారు. మంద కృష్ణమాదిగ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ఎక్స్‌లో పోస్టు పెట్టారని... కూటమిలో చిచ్చు పెట్టాలని శకునిలా తాపత్రయ పడుతున్నారంటూ మండిపడ్డారు. బాలయ్య షో లో కూడా చంద్రబాబు తనకు పవన్‌పై ఉన్న అభిమానం ఎంతో చెప్పారన్నారు. 2027 లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని విజయసాయిరెడ్డి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. జమిలీ ఎన్నికలపై ఇంకా చట్టం చేయలేదని.. పార్లమెంట్‌లో బిల్లు పాస్ అవ్వాలన్నారు. వైసీపీలో పెరిగిన వలసలు ఆపేందుకే ఈ చిత్తకార్తి కుక్క విజయసాయిరెడ్డి ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.‘‘ షర్మిల తన కొడుకు పెళ్లికి చంద్రబాబుకు ఆహ్వానపత్రిక ఇవ్వడానికి వెళితే.. పసుపు చీర కట్టుకుని ఆకర్షించిందని ఈ చిత్తకార్తి కుక్క వాగాడు. ఆకర్షించడం అంటే అసలు ఎన్ని అర్ధాలు వస్తాయో నీకు తెలుసారా చిత్తకార్తి కుక్కా. వైఎస్ దయతో ఎదిగిన నువ్వు.. అదే వైఎస్ బిడ్డపై నీచంగా మాట్లాడతావా. వైసీపీ నేతలు, అభిమానులకు రోషం, పౌరుషం ఉందా. విజయసాయిరెడ్డి అనే చిత్తకార్తి కుక్కకు బుద్ది చెప్పే ధైర్యం మీకు లేదా. రెండు చెంపలు పగులకొట్టకుండా.. ఇంకా పార్టీలో ఉంచుకుని.. పెత్తనం ఇస్తారా. లోకేష్ బాబు జూమ్ మీటింగ్‌లో కొడాలి నాని, వంశీలను నీ ఇంట్లో ఉంచి తీసుకొచ్చావు. ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించడం కాదు. ఇప్పుడు దమ్ముంటే రండి జూమ్ మీటింగ్‌లోకి చూద్దాం. చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న విజయసాయిరెడ్డి.. నీకు సిగ్గు, శరం ఉందా. 16నెలలు జైల్లో ఉన్న విజయసాయిరెడ్డి.. మళ్లీ అవినీతిపై మరోసారి జైలుకు వెళ్లడం ఖాయం’’ అని స్పష్టం చేశారు.‘‘ఈ చిత్తకార్తి కుక్క ఎన్ని వేషాలు వేసినా.. శిక్ష తప్పదు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి మొరుగడం కాదు ఇక్కడికి రా. ఈసారి నేను కూడా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కే వచ్చి నీ సంగతి చెబుతా. ఎక్స్‌లో ఇష్టం వచ్చినట్లు పోస్టు పెడితే.. నీకు దేహశుద్ది తప్పదు. జగన్ ఇక్కడ అధికారంలోకి రాడు.. కలలు కనడం మానుకో. నేను చంద్రబాబుకు విధేయుడిని.. పార్టీ కోసం పని చేస్తాను. నాకు పదవి ఇచ్చినా తీసుకుంటా.. కాదన్నా.. నేను నా పని నేను చేస్తా. నాకు వ్యక్తిగత ఎజెండాలు లేవు... చంద్రబాబు ఎజెండానే నా ఎజెండా’’ అని బుద్దా వెంకన్న తేల్చిచెప్పారు.

 

 

 

 

Tags:
Views: 5

Advertisement

Latest News

ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 12:సోమవారం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్  2024-2025 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల...
మత్తు వదలని గ్రామాలు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎం.ఆర్.పి.ఎస్ ఆత్మీయ సమ్మేళనన్ని జేయప్రదం చేయండి..గడ్డిపర్తి శ్రీనివాసరావు
26వ తేదీ నుంచి మెగా సప్లిమెంటరీ పరీక్షలు
వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..
జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ రియాక్షన్ ఇదే