పల్నాడు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్దారెడ్డి టీం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి నవంబర్ 01:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం, ముటుకూరు గ్రామంలో దసరా సందర్భంగా ముటుకూరు తెలుగు యువత పల్నాడు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముటుకూరు గ్రామ పెద్దల సహాయ సహకారాలతో నిర్వహించారు. అక్టోబర్ 31 దీపావళి సందర్భంగా సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు నిర్వహించారు. మొదటి బహుమతి పెద్దారెడ్డి మాచర్ల టీం గెలుపొందింది గెలుపొందిన మాచర్ల పెద్దారెడ్డి టీం 30 వేల రూపాయలను ముటుకూరు గ్రామ పెద్దలు సునీత సాయి శంకర్ ఎంపీపీ దుర్గి, లింగా రమేష్ టిడిపి మండల నాయకులు, పుట్ట భార్గవ్ టిడిపి యువ నాయకులు బహుకరించారు. ద్వితీయ బహుమతి ముటుకూరు హోం టీం గెలుపొందింది వీరికి దొండపాటి చెన్నయ్య ముటుకూరు గ్రామ సర్పంచ్, దొండపాటి అనంతరామయ్య టిడిపి నాయకులు, దొండపాటి అంజయ్య టిడిపి క్లస్టర్, మన రెస్టారెంట్ 20 వేల రూపాయలు బహుమతి అందజేశారు. తృతీయ బహుమతి వెల్దుర్తి టీం గెలుపొందింది. వీరికి మానుపాటి దాసరాదయ్య , పార్వతమ్మ ముటుకూరు మాజీ సర్పంచ్ వారి జ్ఞాపకార్ధంగా వారి కుమారుడు మానుపాటి అమరాకృష్ణ గెలుపొందిన వెల్దుర్తి టీంకు పదివేల రూపాయలను బహుకరించారు. బెస్ట్ బ్యాట్స్మెన్ గా క్రాంతి వెల్దుర్తి టీం నిలిచాడు, అలాగే బెస్ట్ బౌలర్ మరియు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా మాచర్ల సుధీర్ కుమార్ సాధించారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ 5116 లు మాచర్ల రవీంద్ర మరియు కుక్కమూడి మరియదాసు విద్యా కమిటీ చైర్మన్ లు అందజేశారు. అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్ 4116 లు ముటుకూరు సచివాలయ సిబ్బంది. అందజేశారు. అలాగే బెస్ట్ బౌలర్ కి 4116 లు కొప్పనాతి వీర్రాజు టీచర్ అందజేశారు. అలాగే మాన్ ఆఫ్ ది మ్యాచ్ షీల్డ్ జనసేన పార్టీ దుర్గి మండల అధ్యక్షుడు తోటకూర శ్రీనివాసరావు అందజేశారు. ఈ టోర్నమెంట్ మెయింటినెన్స్ చేసినందుకు నక్క శ్రీను ఖర్చును అందజేశారు. ఈ సందర్భంగా ముటుకూరు గ్రామ పెద్దలు మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో ముటుకూరు పేరు ప్రఖ్యాతలు నలు దిశల వ్యాపించేలా ఇలాంటి మంచి కార్యక్రమాలకు గ్రామ పెద్దలు సహాయ సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. అలాగే తెలుగు యువత ఆర్గనైజర్స్ మాట్లాడుతూ ముటుకూరు గ్రామంలో ఎటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించాలన్నప్పుడల్లా మమ్మల్ని నడిపిస్తున్న మా గ్రామ పెద్దలకు, నాయకులకు, గ్రామస్తులకు మేము ఎప్పుడు రుణపడి ఉంటామని ఊరికి మంచి పేరు తీసుకొస్తామని తెలియజేశారు.
Comment List