ఎన్ని అవాంతరాలు వచ్చిన ఒకటవ తారీఖునే పింఛన్లు పంపిణీ

ఎన్ని అవాంతరాలు వచ్చిన ఒకటవ తారీఖునే పింఛన్లు పంపిణీ

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి  నవంబర్ 02 :ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఒకటవ తేదీనే సామాజిక పెన్షన్లు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మాచర్ల శాసనసభ్యులు జూలకటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. శుక్రవారం మాచర్ల పట్టణంలోని 15,17 వార్డులలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన వృద్ధులకు వికలాంగులకు సామాజిక పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. పురపాలక సంఘ పరిధిలో వార్డుల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఇంటి వద్దకే సామాజిక పెన్షన్లు అందించటం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చెందిన దేశాలతో నవ్యాంధ్రప్రదేశ్ పోటీ పడుతుందని ఆయన అన్నారు. సూపర్  సిక్స్  పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల అభిమానాలను ఎన్డీఏ ప్రభుత్వం చూరగొంటుందని అన్నారు.

Tags:
Views: 21

Advertisement

Latest News

దుర్గి మండలం లో నేటినుంచి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు దుర్గి మండలం లో నేటినుంచి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి  ప్రతినిధి నవంబర్ 13:పల్నాడు జిల్లా, మాచర్లనియోజకవర్గం,దుర్గి మండలం, దుర్గి గ్రామం  నందుగల గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ది...
నిరుద్యోగి అఖిల్ మనస్థాపంతో రిజర్వాయర్ లోకి దూకి ఆత్మహత్య.
ప్రభుత్వం మారి నెలలు గడిచినా కొత్తరేషన్ కార్డులు ఇచ్చేదెన్నడో..?గతప్రభుత్వం నిబంధనల పేరుతో కొత్త రేషన్ కార్డు జారీ విఫలం
ఘనంగా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం..
ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
మత్తు వదలని గ్రామాలు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున