ఘనంగా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం..

ఘనంగా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం..

ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 13:రెంటచింతల గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి 20వ తేదీ వరకూ గ్రంథాలయవారోత్సవాలునిర్వహించనున్నట్లు స్థానిక గ్రంథాలయ అధికారి రాయపాటి రాజకిషోర్ తెలిపారు.వారు మాట్లాడుతూ గ్రంథాలయ సంస్థ ఆదేశాలతో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను మండల కేంద్రమైన రెంటచింతలలోని గ్రంథాలయం నందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది నవంబరు 14 నుంచి 20వ తేదీ వరకూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వారోత్స వాల్లో భాగంగా ప్రారంభం రోజున బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పుస్తక ప్రదర్శన, విద్యార్థినీ,విద్యార్థులకువివిధరకాలపోటీలుచిత్రలేఖనం,వ్యాసరచన,క్రికెట్ పోటీలు నిర్వహణ,సాంస్కృతిక కార్యక్రమాలు,కవి సమ్మే ళనం, గ్రంథాలయ ఉద్యమకారుల సంస్కరణ సభలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయన్నారు. ఈనెల 20వ తేదీన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేయనున్నట్లు తెలిపారు.ఈవారోత్సవాల్లోప్రజాప్రతినిధులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Tags:
Views: 10

Advertisement

Latest News

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని జగన్ అనడం విడ్డూరం : చిరుమామిళ్ల మధుబాబు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని జగన్ అనడం విడ్డూరం : చిరుమామిళ్ల మధుబాబు
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 14 :ఎన్ డి ఎ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడుస్తుంది, పెట్టుబడి లే ధ్యేయంగా యువ...
పోసాని కృష్ణమురళి పై మాచర్లలో ఫిర్యాదు
మాచర్లలో కలెక్టర్ అరుణ్ బాబు ఆకస్మిక పర్యటన
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 1854 కోట్లు కేటాయించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు : గంధం మల్లయ్య
దుర్గి మండలం లో నేటినుంచి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
నిరుద్యోగి అఖిల్ మనస్థాపంతో రిజర్వాయర్ లోకి దూకి ఆత్మహత్య.
ప్రభుత్వం మారి నెలలు గడిచినా కొత్తరేషన్ కార్డులు ఇచ్చేదెన్నడో..?గతప్రభుత్వం నిబంధనల పేరుతో కొత్త రేషన్ కార్డు జారీ విఫలం