హెచ్.పి.సి.ఎల్. విశాఖ రిఫైనరీ బాధ్యత స్పూర్తిదాయకం

హెచ్.పి.సి.ఎల్. విశాఖ రిఫైనరీ  బాధ్యత స్పూర్తిదాయకం

ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ ప్రతినిధి నవంబర్ 6: హెచ్.పి.సి.ఎల్. విశాఖ రిఫైనరీ విశాఖ నగర కాలుష్య నియంత్రణకు సామాజిక బాధ్యత వహించి చాలా కృషి చేస్తుందని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన రెండవ జోన్ ముడసర్లోవ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద హెచ్.పి.సి.ఎల్. సహకారంతో నగర కాలుష్య నియంత్రణ కొరకు 88 లక్షల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి నిధులతో 26,500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని హెచ్.పి.సి.ఎల్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంగనాథన్ రామకృష్ణన్ తో కలిసి శ్రీకారం చుట్టి ఆ ప్రాంతంలో మొక్కలు నాటారు.  ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణకు హెచ్.పి.సి.ఎల్. సామాజిక బాధ్యతతో అందిస్తున్న మొక్కలను నగర పరిధిలో కాలుష్య నియంత్రణ మరియు పర్యావరణాన్ని పరిరక్షణ కొరకు లబ్దిదారులను మరియు ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ పలుచోట్ల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ముడసర్లోవ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద హెచ్.పి.సి.ఎల్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంగనాథన్ రామకృష్ణన్ తో కలిసి మొక్కలను నాటారు. ఈ ఆవరణలో మొక్కలు నాటి ఒక నందనవనంగా తయారు చేయాలని జీవీఎంసీ అదనపు  కమీషనర్ ఆర్.సోమనారాయణ ను కమిషనర్ ఆదేశించారు. అలాగే హెచ్.పి.సి.ఎల్. ఒక సామాజిక బాధ్యతగా భావించివిశాఖకాలుష్యనిర్మూలనకువిశేషకృషిచేస్తున్నందుకు గాను హెచ్.పి.సి.ఎల్. విశాఖ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ముడసర్లోవ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ అభివృద్ధికి హెచ్.పి.సి.ఎల్. విశాఖ రిఫైనరీ సామాజిక భాద్యతతో సహకారం అందిస్తున్నందుకు ఆ ప్రాంతాన్ని  హెచ్.పి.సి.ఎల్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జివిఎంసి కమీషనర్ ఈ సందర్భంగా పరిశీలించారు. అనంతరం హెచ్.పి.సి.ఎల్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాట్లాడుతూ విశాఖ నగరాభివృద్ధికి, కాలుష్యం నిర్మూలనకు హెచ్.పి.సి.ఎల్. ఎప్పుడు తన వంతు సామాజిక బాధ్యతగా వహించి సహాయ సహకారాలు అందించుటకు సిద్దంగా ఉన్నదని కమిషనర్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో విఎంసి ప్రధాన ఇంజనీరు పి.శివ ప్రసాద రాజు, పర్యవేక్షక ఇంజనీరు గోవిందరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, కార్యనిర్వాహక ఇంజనీరు దిలీప్, ఎ.ఎం.ఓ.హెచ్. డాక్టర్ ఎన్.కిషోర్ కుమార్, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు, సహాయక ఇంజనీర్లు, హెచ్.పి.సి.ఎల్. సీనియర్ మేనేజర్  తదితరులు పాల్గొని మొక్కలను నాటారు.

Tags:
Views: 15

Advertisement

Latest News

ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 12:సోమవారం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్  2024-2025 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల...
మత్తు వదలని గ్రామాలు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎం.ఆర్.పి.ఎస్ ఆత్మీయ సమ్మేళనన్ని జేయప్రదం చేయండి..గడ్డిపర్తి శ్రీనివాసరావు
26వ తేదీ నుంచి మెగా సప్లిమెంటరీ పరీక్షలు
వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..
జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ రియాక్షన్ ఇదే