విలేకరుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం. చందు రాథోడ్

విలేకరుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం. చందు రాథోడ్

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి నవంబర్ 3:పల్నాడు జిల్లా, దుర్గి మండలం,ఇటీవల కాలంలో ఓ పత్రికలో మాచర్ల శాసనసభ్యులపై వచ్చిన కథనంపై స్పందిస్తూ  దుర్గి మండల కూటమి నేతలు స్థానిక మండల అభివృద్ధి కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు వెలుదండి శ్రీనివాసరావు మాట్లాడుతూ విలేకరులకు తీట ఎక్కి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వార్తలు రాయాలని అసభ్యకర పదజాలలతో మాట్లాడారు. దీన్ని ఖండిస్తూ ఆదివారం ఏపీయూడబ్ల్యూజే దుర్గి మండల శాఖ వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చందు రాథోడ్ మాట్లాడుతూ తమ ఎదుగుదలకు విలేకరులను వాడుకొని అవసరం లేనప్పుడు పాత్రికేయులపై ఇలాంటి పదాలు వాడటం సబబు కాదని అన్నారు. పాత్రికేయులు అంటే ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారదులుగా నిస్వార్ధంగా పనిచేసే వారన్నారు. పాత్రికేయులు పట్ల ఇలాంటి వాక్యాలు చేస్తే మేము న్యాయపరమైన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దుర్గి మండలం విలేకరులు పాల్గొన్నారు.

Tags:
Views: 4

Advertisement

Latest News

ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 12:సోమవారం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్  2024-2025 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల...
మత్తు వదలని గ్రామాలు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎం.ఆర్.పి.ఎస్ ఆత్మీయ సమ్మేళనన్ని జేయప్రదం చేయండి..గడ్డిపర్తి శ్రీనివాసరావు
26వ తేదీ నుంచి మెగా సప్లిమెంటరీ పరీక్షలు
వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..
జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ రియాక్షన్ ఇదే