కుప్పం, పిఠాపురం ప్రజలకు శుభవార్త..డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు !
ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 06:కుప్పం, పిఠాపురం ప్రజలకు శుభవార్త.. కుప్పం, పిఠాపురం ప్రాంతాల కోసం డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయనున్నారు. ఏపీ కేబినేట్ నిర్ణయాలు తీసుకుంది.ఏపీలో జ్యూడిషియల్ ఆఫీసర్ల ఉద్యోగ విరమణ వయస్సును 61కి పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. 2014-18 మధ్య నీరు చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపులు, పనుల ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు ప్రోహిబిషన్ 2024కు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్…. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు 1982 రిపీల్ బిల్లును కూడా ఆమోదించింది.ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణను ఆమోదించిన మంత్రిమండలి… ఏపీ ఎక్స్రైజు చట్ట సవరణ ముసాయిదాకు ఆమోదం తెలిపింది. కుప్పం కేంద్రంగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ లో సుస్థిరాభివృద్ధి సాధనకు ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేబినెట్… సీఆర్డీఏ పరిధిని 8352 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది ఏపీ కేబినేట్. పలనాడు, బాపట్ల అర్బన్ డవలెప్మెంట్ అథారిటీల నుంచి 11 మండలాల్లో 154 గ్రామాలను తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి తెస్తూ ఆమోదం తెలిపింది కేబినేట్.
Comment List