మహనీయుని త్యాగాలను స్మరించుకోవాలి : జూలకంటి

మహనీయుని త్యాగాలను స్మరించుకోవాలి : జూలకంటి

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 02 :భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు తన ప్రాణాన్ని తృణప్రాయంగా త్యజించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను నేటి యువత స్మరించుకోవాలని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. శుక్రవారం మాచర్ల పట్టణంలో ఆర్యవైశ్య సంఘ నేతలు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ తెలుగు ప్రజల భవిష్యత్తు కొరకు భాషా ప్రయోక్త రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకు జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని అహింసా మార్గంలో సుదీర్ఘ ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు అమరజీవి శ్రీరాములు కారణభూతుడయ్యాడని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు పట్టణ అధ్యక్షులు కొమ్మెర దుర్గారావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సూరే ఎలమంద కజ్జం సైదయ్య ఎనుముల కేశవరెడ్డి మద్దిగప్పు చిన్న వెంకటరామిరెడ్డి కంభంపాటి అనిల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:
Views: 8

Advertisement

Latest News

దుర్గి మండలం లో నేటినుంచి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు దుర్గి మండలం లో నేటినుంచి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి  ప్రతినిధి నవంబర్ 13:పల్నాడు జిల్లా, మాచర్లనియోజకవర్గం,దుర్గి మండలం, దుర్గి గ్రామం  నందుగల గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ది...
నిరుద్యోగి అఖిల్ మనస్థాపంతో రిజర్వాయర్ లోకి దూకి ఆత్మహత్య.
ప్రభుత్వం మారి నెలలు గడిచినా కొత్తరేషన్ కార్డులు ఇచ్చేదెన్నడో..?గతప్రభుత్వం నిబంధనల పేరుతో కొత్త రేషన్ కార్డు జారీ విఫలం
ఘనంగా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం..
ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
మత్తు వదలని గ్రామాలు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున