దుర్గి మండలం లో నేటినుంచి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి నవంబర్ 13:పల్నాడు జిల్లా, మాచర్లనియోజకవర్గం,దుర్గి మండలం, దుర్గి గ్రామం నందుగల గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ది 14-11-24 నుండి 20-11-24 వరకు నిర్వహించనున్నట్లు దుర్గి గ్రంథాల శాఖ అధికారి పివేణు గోపి తెలిపారు. ఈ సందర్భంగా దుర్గి మండలంలోని విద్యార్థిని విద్యార్థులకు ప్రకృతి దృశ్యాలు, సేవ్ గర్ల్స్ ,అనే అంశంపై చిత్రలేఖనం, పర్యావరణం - పరిరక్షణ అనే అంశంపై వ్యాసరచన, గ్రంథాలయాలు - ఆవశ్యకత మరియు సమాజంపై సోషల్ మీడియా అనే అంశంపై డిబెట్, క్విజ్ మరియు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గిమండల ప్రజలు, గ్రంధాలయ పాటకులు, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా టి వేణు కోరారు.
Tags:
Views: 10
Latest News
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని జగన్ అనడం విడ్డూరం : చిరుమామిళ్ల మధుబాబు
14 Nov 2024 22:00:13
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 14 :ఎన్ డి ఎ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడుస్తుంది, పెట్టుబడి లే ధ్యేయంగా యువ...
Comment List