ప్రభుత్వం మారి నెలలు గడిచినా కొత్తరేషన్ కార్డులు ఇచ్చేదెన్నడో..?గతప్రభుత్వం నిబంధనల పేరుతో కొత్త రేషన్ కార్డు జారీ విఫలం

ప్రభుత్వం మారి నెలలు గడిచినా కొత్తరేషన్ కార్డులు ఇచ్చేదెన్నడో..?గతప్రభుత్వం నిబంధనల పేరుతో కొత్త రేషన్ కార్డు జారీ విఫలం

 ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 13:కూటమి ప్రభుత్వం అందించే పలు పథకాలు,సంక్షేమ కార్యక్రమాలకు తప్పనిసరిగా రేషన్‌ కార్డు కలిగి యుండాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్న ఆలోచనతో కొత్త రేషన్‌ కార్డులను పొందడానికి లబ్ధిదారులు ఆసక్తిని కనబరుస్తున్నారు.గత వైకాపా ప్రభుత్వంలో కొత్త రేషన్‌ కార్డులకు,మార్పులు,చేర్పులకు నిబంధనల పేరుతో  ఉన్న కార్డుల్లో కొత్తగా పేర్ల నమోదుకూ అవకాశం ఇవ్వలేదు. వైకాపా ప్రభుత్వంలో దరఖాస్తు చేసు కున్న వారికి ఎదురు చూపులే మిగిలాయి.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కారమవుతాయేమోనన్న అభిప్రాయాలతో కొత్తరేషన్ కార్డు దారులు ఉన్నారు. కొత్త రేషన్‌ కార్డులపై అర్హులైన పేద ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు.రేషన్‌ కార్డుల్లో చేర్పులు,మార్పులకు ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో మండలంలో రేషన్‌ బియ్యం రాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా రేషన్‌ కార్డుల్లో ఇతర కుటుంబ సభ్యుల పేర్లను చేర్చకపోవడం తో తిప్పలు తప్పట్లేదు.ఒక వైపు కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వకపోవడం,మరో వైపు పాత రేషన్‌ కార్డుల్లో చేర్పులు,మార్పులు చేయకపో వడంతో అర్హులైన లబ్ధిదారులు నిరాశకు గురవుతున్నారు.ఇప్పటికైనాకూటమిప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై  దృష్టి పెట్టాలని, నిబంధనలు తొలగించిఅర్హులైన కొత్త రేషన్ కార్డుదారులకు సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని లబ్ధిదారులు విన్నవించుకుంటున్నారు.

Tags:
Views: 11

Advertisement

Latest News

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని జగన్ అనడం విడ్డూరం : చిరుమామిళ్ల మధుబాబు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని జగన్ అనడం విడ్డూరం : చిరుమామిళ్ల మధుబాబు
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 14 :ఎన్ డి ఎ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడుస్తుంది, పెట్టుబడి లే ధ్యేయంగా యువ...
పోసాని కృష్ణమురళి పై మాచర్లలో ఫిర్యాదు
మాచర్లలో కలెక్టర్ అరుణ్ బాబు ఆకస్మిక పర్యటన
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 1854 కోట్లు కేటాయించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు : గంధం మల్లయ్య
దుర్గి మండలం లో నేటినుంచి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
నిరుద్యోగి అఖిల్ మనస్థాపంతో రిజర్వాయర్ లోకి దూకి ఆత్మహత్య.
ప్రభుత్వం మారి నెలలు గడిచినా కొత్తరేషన్ కార్డులు ఇచ్చేదెన్నడో..?గతప్రభుత్వం నిబంధనల పేరుతో కొత్త రేషన్ కార్డు జారీ విఫలం