నిరుద్యోగి అఖిల్ మనస్థాపంతో రిజర్వాయర్ లోకి దూకి ఆత్మహత్య.

ఫోన్ ద్వారా సంతాపం తెలిపిన శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి..

నిరుద్యోగి అఖిల్ మనస్థాపంతో రిజర్వాయర్ లోకి దూకి ఆత్మహత్య.

ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 13:రెంటచింతల మండలంలోని రెంటాలకు చెందిన కొత్త అఖిల్ కుమార్ (26) సోమవారం నాడు మంచికల్లు బుగ్గవాగు రిజర్వాయర్ లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బి టెక్ చదివిన అఖిల్ నాలుగేళ్ల క్రితం హైదరాబాదులో ఉద్యోగం చేశాడు. రెండేళ్లుగా ఖాళీగా ఉన్నాడు. ఉద్యోగానికి ఏ కంపెనీ నుండీ కాల్ లెటర్ రాకపోవటంతో దళారులను ఆశ్రయించి లక్షలాది రూపాయలు ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అఖిల్ సోమవారం మద్యాహ్నం  ఆత్మహత్యకు పాల్పడ్డాడు.జాలర్లు బుధవారం శవాన్ని నది నుండి వెలికితీసి పోలీసులకు అప్పచెప్పారు.మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు ఎస్సై నాగార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అఖిల్ అవివాహితుడు.మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి  అఖిల్ తల్లిదండ్రులతోఫోన్లోమాట్లాడారు.సంతాపం తెలిపారు.ధైర్యంగాఉండాలని కోరారు.

Tags:
Views: 60

Advertisement

Latest News

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని జగన్ అనడం విడ్డూరం : చిరుమామిళ్ల మధుబాబు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని జగన్ అనడం విడ్డూరం : చిరుమామిళ్ల మధుబాబు
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 14 :ఎన్ డి ఎ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడుస్తుంది, పెట్టుబడి లే ధ్యేయంగా యువ...
పోసాని కృష్ణమురళి పై మాచర్లలో ఫిర్యాదు
మాచర్లలో కలెక్టర్ అరుణ్ బాబు ఆకస్మిక పర్యటన
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 1854 కోట్లు కేటాయించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు : గంధం మల్లయ్య
దుర్గి మండలం లో నేటినుంచి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
నిరుద్యోగి అఖిల్ మనస్థాపంతో రిజర్వాయర్ లోకి దూకి ఆత్మహత్య.
ప్రభుత్వం మారి నెలలు గడిచినా కొత్తరేషన్ కార్డులు ఇచ్చేదెన్నడో..?గతప్రభుత్వం నిబంధనల పేరుతో కొత్త రేషన్ కార్డు జారీ విఫలం