రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీఎం సంచలన నిర్ణయం
ఐ ఎన్ బి టైమ్స్ సెప్టెంబర్ 12:రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం కొనసాగుతోన్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియ గడువు తేదీని మరోసారి పొడిగించింది. ఈనెల 15వ తేదీ వరకు బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని కోరిక ప్రభుత్వం ఆ గడువును మరోమారు పొగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.గత ప్రభుత్వం సెప్టెంబర్ 22వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 23 తేదీ నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎక్సైజ్ శాఖ బదిలీల గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.. అక్టోబర్ 1 తేదీన ఆ శాఖ బదిలీల్లో నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొందిప్రస్తుతం కొన్ని కారణాలతో బదిలీల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు ఉన్నాయి. కొందరు తప్పుడు దారుల్లో బదిలీలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయంపై ప్రభుత్వం సీరియస్ అయిన విషయం తెలిసిందే. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వరద సహాయక చర్యల్లో ఉండడంతో.. ఇప్పుడు మరోసారి ఉద్యోగుల బదిలీల గడువును ప్రభుత్వం పొడిగించినట్టుగా తెలుస్తోంది.
Comment List