నాని, వంశీ మౌనం వెనుక - బిగ్ ట్విస్ట్, కీలక మలుపు..!!

నాని, వంశీ మౌనం వెనుక - బిగ్ ట్విస్ట్, కీలక మలుపు..!!

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 18:వైసీపీ నేతలు కొడాలి నాని, వంశీ మౌనం పాటిస్తున్నారు. వైసీపీ హయాంలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న ఈ ఇద్దరు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సైలెన్స్ అయిపోయారు. విజయవాడలో వరదలు..ప్రభుత్వ సాయం పైన స్పందించలేదు. కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తవుతున్నా పాలన పైన ఎక్కడా వ్యాఖ్యలు చేయలేదు. అయితే, ఈ ఇద్దరి విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.టీడీపీ లో రాజకీయాలు ప్రారంభించిన కొడాలి నాని, వంశీ వైసీపీలోకి వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో టీడీపీని టార్గెట్ చేసి ఆ ఇద్దరు నేతల తీరు వివాదాస్పదం అయింది. ప్రధానంగా చంద్రబాబు, లోకేష్ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో పరుష పదజాలంతో విమర్శలు చేసారు. మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అసెంబ్లీలో..బయటా చంద్రబాబును లక్ష్యంగా చేసారు. వ్యక్తిగతంగా సీరియస్ కామెంట్స్ తో విరుచుకుపడేవారు. ఈ ఇద్దరు చేసిన వ్యాఖ్యలతో టీడీపీ నేతలకు టార్గెట్ అయ్యారు.తాజా ఎన్నికల్లో ఇద్దరినీ ఓడించాలనే లక్ష్యంగా టీడీపీ, జనసేన శ్రేణులు కలిసికట్టుగా పని చేసాయి. ఇద్దరూ బారీ మెజార్టీతో ఓడిపోయారు. కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే నాని, వంశీ ఇద్దరూ కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వచ్చేసారు. ఆ తరువాత వంశీ విదేశాలకు వెళ్లిపోయారు. నాని పార్టీ అధినేత జగన్ తో పలు సందర్భాల్లో వరుసగా సమావేశమయ్యారు. ఇద్దరి పైనా వేర్వేరే కేసులు నమోదయ్యాయి. కోర్టు ను ఆశ్రయించటంతో ఇద్దరూ అరెస్ట్ కాలేదు. ఆ తరువాత ఇద్దరూ మౌనం వీడలేదు.ఇక..విజయవాడలో వరదలు వచ్చి భారీ నష్టం జరిగింది. జగన్ రెండు సార్లు పర్యటించారు. కానీ, ఈ ఇద్దరూ ఎక్కడా కనిపించ లేదు. సహాయక చర్యల్లోనూ భాగస్వామ్యం లేదు. ప్రభుత్వం పైన విమర్శలు చేయలేదు. అయితే..ఈ ఇద్దరి మౌనం వెనుక వైసీపీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంత కాలం వివాదాలకు దూరంగా ఉండాలని పార్టీ నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది. అయితే, వైసీపీ వీడుతారనే ప్రచారమూ జరుగుతోంది. కానీ..ఈ ఇద్దరూ పార్టీ మారే అవకాశం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు ఈ ఇద్దరి వ్యవహారం జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారుతోంది.

Tags:
Views: 1

Advertisement

Latest News

అమూల్య నర్సింగ్ హోమ్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు జూలకంటి గౌతమ్ రెడ్డి అమూల్య నర్సింగ్ హోమ్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు జూలకంటి గౌతమ్ రెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి నవంబర్ 10 :పల్నాడు జిల్లా, దుర్గి మండలం, ముటుకూరు గ్రామంలో అమూల్య నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో నరసరావుపేట ఎమ్మెల్యే డా"చదలవాడ...
ఏపీ శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ గా చేరెడ్డి మంజులా కోటిరెడ్డి.
నామినేటెడ్‌ పదవుల రెండో జాబితా విడుదల.
పిరికివాడివైతే రాజీనామా చేయ్.. జగన్‍కు షర్మిల సవాల్
నీకు బుద్ధి జ్ఞానం ఉందా.. జగన్‌పై మంత్రి అచ్చెన్న ఫైర్
లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించిన విద్యుత్ అధికారులు
వీవీఐటీలో మంత్రి నారా లోకేశ్ సందడి