రమణా చారిటబుల్ సొసైటి ను అభినందించిన ఎమ్మెల్యే..జూలకంటి .పేదవిద్యార్థులకు అండగా నవులూరి శివారెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ రెంటచింతల సెప్టెంబర్ 18:రమణా చారిటబుల్ సొసైటీ వ్యవస్దాపకులు,మాజీ జై భారత్ నేషనల్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నవులూరి శివారెడ్డి ని బుధవారం నాడు మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఫోన్ చేసి అభినందించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా నవులూరి శివారెడ్డి ఎంతోమంది పేద విద్యార్థులకు,స్కూల్ ఫీజులు,స్కూల్ బ్యాగ్ లను,నోట్ బుక్స్ అందించడం పట్ల హర్షంవ్యక్తం చేశారు.రానున్న రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు.రమణా చారిటబుల్ సొసైటి వ్యవస్దాపకులు,మాజీ జై భారత్ నేషనల్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నవులూరి శివారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ని ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం నవులూరి శివారెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో రమణా చారిటబుల్ సొసైటి ద్వారా సమాజానికి ఉపయోగకరమైన మరెన్నో కార్యక్రమాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Comment List