నెల్లూరులో కొలువైన బంగారు వినాయకుడు
ఐ ఎన్ బి టైమ్స్ నెల్లూరు సెప్టెంబర్ 9 : సంతపేటలో ఉన్న గ్రంధి జయకృష్ణకు ప్రతియేటా వినాయక చవితికి ప్రత్యేకంగా గణ నాధుని రూపొందించి స్వామివారి ఆశీస్సులు అందుకోవడం ఆనవాయితీగా వస్తోంది . గతంలో లంబోధరుణ్ణీ లాల్బాగ్ , స్టోన్ వర్క్ , వెంకటేశ్వర స్వామి రూపంలో,మరియు దారపు ఉండలతో రూపొందించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు . ఈ యేడాది ఇంకొంచం ప్రత్యేకంగా వినాయకుడిని తయారు చేయాలన్న తపనతో , తన సతీమణి విష్ణువందన సహకారం తీసుకొని పదివేల బంగారుగుండ్లుతో ప్రత్యేక ఆకర్షణతో విలక్షణమైన వినాయకుని తయారుచేసి అబ్బురపరిచారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 45 రోజులపాటు శ్రమించి బంగారంతో గణపయ్యను రూపొందించానన్నారు. ముందుగా హైదరాబాద్ వెళ్లి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన గణనాధుని తీసుకొచ్చి బంగారు సొబగులధ్ధి ఆయనను పూజిస్థున్నానని వివరించారు. తన స్వగృహంలో స్వామివారు మూడు రోజులపాటు పూజలందుకున్నారని చెప్పారు. స్వర్ణంతో ప్రత్యేకంగా తయారు చేసిన వినాయకుడిని చూసి అందరూ తమను అభినందనలతో ముంచెత్తారని ఇది తమకెంతో సంతృప్తినిచ్చిందన్నారు .
Comment List