దూసుకొస్తున్న ఎక్స్ఈసీ వైరస్ .. యూరప్‌లో తొలి కేసు నమోదు

దూసుకొస్తున్న ఎక్స్ఈసీ వైరస్ .. యూరప్‌లో తొలి కేసు నమోదు

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 18:కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కలవర పెట్టిందో అందరికి తెలిసిందే. ఆ కొవిడ్-19కు సంబంధించిన కొత్త వేరియంట్ ఎక్స్‌ఈసీ రూపంలో ఇప్పటికే యూరప్‌లో అంటు వ్యాధిలా విస్తరిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఈ ఎక్స్ఈసీ వేరియంట్‌ను తొలి సారి యూరప్‌లో గుర్తించారని తెలిపారు.కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కలవర పెట్టిందో అందరికి తెలిసిందే. ఆ కొవిడ్-19కు సంబంధించిన కొత్త వేరియంట్ ఎక్స్‌ఈసీ (XEC) రూపంలో ఇప్పటికే యూరప్‌లో అంటు వ్యాధిలా విస్తరిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఈ ఎక్స్ఈసీ వేరియంట్‌ను తొలి సారి యూరప్‌లో గుర్తించారని తెలిపారు. అనంతరం ఈ వేరియంట్ యూకే, యూఎస్, డెన్మార్క్‌తోపాటు ఇతర దేశాలకు సైతం విస్తరించిందని పేర్కొన్నారు.ఇది రెండు ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ నుంచి ఎక్స్ఈసీ హైబ్రిడ్ రకంగా అవిర్భవించిందని వివరించారు. శీతాకాలంలో ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో దీనిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ లేదా బూస్టర్ డోస్ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు. తద్వారా ఆసుపత్రిలో చేరడం కానీ, అనారోగ్యం బారిన పడడం కాని ఉండదని చెప్పారు.ఇప్పటికే 27 దేశాల నుంచి 500 శాంపిల్స్ సేకరించగా.. ఆ నమూనాల్లో ఎక్స్ఈసీ వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించారు. డెన్మార్క్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్‌లలో ఈ ఎక్స్ఈసీ బలంగా పెరుగుతుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.జర్వం, గోంతు మంట, దగ్గు, వాసన తెలియక పోవడం, ఆకలి లేకపోవడం, ఒంటి నొప్పులు ద్వారా కొత్త రకం కోవిడ్ ఎక్స్ఈసీ లక్షణాలను గుర్తించ వచ్చన్నారు. పరిశ్రుభతను పాటించడంతోపాటు స్వచ్ఛమైన గాలిని పీల్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలకు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన (సీడీసీ) ఈ సందర్బంగా సూచించింది.

 

 

 
Tags:
Views: 0

Advertisement

Latest News

అమూల్య నర్సింగ్ హోమ్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు జూలకంటి గౌతమ్ రెడ్డి అమూల్య నర్సింగ్ హోమ్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు జూలకంటి గౌతమ్ రెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి నవంబర్ 10 :పల్నాడు జిల్లా, దుర్గి మండలం, ముటుకూరు గ్రామంలో అమూల్య నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో నరసరావుపేట ఎమ్మెల్యే డా"చదలవాడ...
ఏపీ శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ గా చేరెడ్డి మంజులా కోటిరెడ్డి.
నామినేటెడ్‌ పదవుల రెండో జాబితా విడుదల.
పిరికివాడివైతే రాజీనామా చేయ్.. జగన్‍కు షర్మిల సవాల్
నీకు బుద్ధి జ్ఞానం ఉందా.. జగన్‌పై మంత్రి అచ్చెన్న ఫైర్
లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించిన విద్యుత్ అధికారులు
వీవీఐటీలో మంత్రి నారా లోకేశ్ సందడి